How To Prevent Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు మెదడులో సిరలు పగిలిపోవడం వల్ల ఇలాంటి సమస్యల వస్తాయి. అంతేకాకుండా సిరల్లో ఫలకం పేరుకుపోయిన కూడా ఇలాంటి సమస్యలే వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మందిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హెమరేజిక్ స్ట్రోక్ వస్తోంది. దీని కారణంగా కొంత మందిలో ప్రాణాంతకంగానూ మారుతోంది. ఇప్పుడు ఈ స్ట్రోక్ అధిక రక్త పోటు ఉన్నవారిలో కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజూ పలు రకాల ఆహారాలు తీసుకున్న ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆహారాలు అతిగా తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ తప్పదా?:
బ్రెడ్:
బ్రెడ్‌లో సోడియం లేబుల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు తినడం వల్ల వారికి ప్రాణాంతకంగానూ మారే అవకాశాలున్నాయి. చాలా మందికి శాండ్‌విచ్‌లు తినే అలవాటు ఉంటుంది. కాబట్టి వీటిని అతిగా తినడం మానుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సోడియం కలిగిన ఆహారాలు అతిగా తీసుకున్న ఇలాంటి సమస్యలు వస్తాయి.
గుడ్లు:
అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు అతిగా గుడ్లు తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వారు గుడ్లు, ఆమ్లేట్ ప్రతి రోజూ తినడం వల్ల మెదడు సిరలు పగిలిపోయే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తినకపోవడమే చాలా మేలు.
వేయించిన వస్తువులు:
బీపీ పేషెంట్ వేయించిన వస్తువులు తినడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి అతిగా తినడం వల్ల మెదడుపై ప్రభావం పడి చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు వీటిని తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.