How To Weight Loss: నానబెట్టిన అంజీర్‌ తింటే 8 రోజుల్లో బెల్లీ ఫ్యాట్‌, శరీర బరువు మాయం..

How To Weight Loss: ప్రస్తుతం చాలా మంది పొట్ట చుట్టు పెరగడం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా నీటిలో నానబెట్టిన అంజీర్‌ పండును ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 03:38 PM IST
How To Weight Loss: నానబెట్టిన అంజీర్‌ తింటే 8 రోజుల్లో బెల్లీ ఫ్యాట్‌, శరీర బరువు మాయం..

How To Weight Loss: పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ పెరగడం కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా శరీర ఆకృతి కూడా కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.అంతేకాకుండా తీసుకునే ఆహారం కూడా డైట్‌ పద్ధతిలో తీసుకోవాలి. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే క్రమంలో డైట్‌ పద్ధతిని పాటిస్తేనే సులభంగా బరువు తగ్గుతారు.

అంజీర్ బరువు తగ్గించడానికి సహాయపడుతుంది:
బరువు తగ్గే క్రమంలో అంజీర్‌ పండ్లును తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అత్తి పండ్లలో ఐరన్, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది. 
 
అంజీర పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తినడం వల్ల పొట్టలోని కొవ్వును వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. ఫిసిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ అంజీర్‌ పండులో లభిస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

3. అంజీర్‌ పండ్లను అత్తి పండ్లు అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్‌ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

4. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నానబెట్టిన అంజీర పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ బాడీలో కేలరీను తగ్గించేందుకు సహాయపడుతుంది.

(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: AP New Medical Colleges: రాష్ట్రంలో 5 కొత్త వైద్య కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు

Also read: AP New Medical Colleges: రాష్ట్రంలో 5 కొత్త వైద్య కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News