Breast Cancer: బ్రెస్ట్ కేన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా భావించే ఆవిష్కరణ వెలుగుచూసింది. ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన ఈ విధానంపై పేటెంట్ కూడా లభించింది. ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా ట్యూమర్ పూర్తిగా నిర్మూలించవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ కేన్సర్ మహిళల పాలిట మృత్యు కుహరంగా మారింది. కేన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ ముఖ్యమైనవే కానీ దుష్పరిణామాలు చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు మద్రాస్ ఐఐటీ బ్రెస్ట్ కేన్సర్ చికిత్సకు కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ విధానంతో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. పేటెంట్ కూడా లభించింది. కేన్సర్ మందు పనిచేసే విధానాన్ని రూపొందించేందుకు నానో మెటీరియల్ రూపకల్పన జరిగింది. కేన్సర్ సోకిన కణాల వరకు కేన్సర్ నిరోధక మందుల్ని చేరుస్తుంది. అంటే కేన్సర్ సెల్స్ వరకూ మందు చేరే విధానం ఇది. ఈ విధానం ద్వారా మందు మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. మద్రాస్ ఐఐటీ రూపొందించిన నానో కేరియర్ బయో కాంపిటిబుల్‌గా ఉంటుంది. అంతేకాకుండా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి విధానాలకు సరైన ఆప్షన్ ఇది. ఇది కేవలం కేన్సర్ సెల్స్ పైనే దాడి చేస్తుంది. ఇతర విధానాల్లో అయితే జుట్టు రాలడం, వాంతులు, వికారం, అలసట వంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి.
ఐఐటీ మద్రాస్ ఆవిష్కరణ గురించి అడ్వాన్స్ అండ్ నానో స్కేల్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనకు ఇటీవలే పేటెంట్ లభించింది. కేన్సర్ చికిత్స విధానంలో ఇదొక గేమ్ ఛేంజర్ కానుంది. చికిత్స విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి భారీ ఉపశమనం కలగనుంది.
Also read: Lemon Remedies: రోజూ క్రమం తప్పకుండా లెమన్ తీసుకుంటే ఊహించని లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి