Health benifits of Potatoes: అటు స్నాక్స్, టిఫిన్స్‌లో, ఇటు భోజనంలోకి కూరల్లో బంగాళదుంపలను మన దేశంలో విరివిగా ఉపయోగిస్తారు. అయితే బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని కొంతమంది భావిస్తుంటారు. అందుకే బంగాళదుంప అంటే ఇష్టమున్నా.. భోజనంలో దాన్ని తక్కువగా తీసుకుంటారు. అయితే చాలామందికి తెలియని విషయమేమిటంటే.. బంగాళదుంపలను ఒక పద్దతి ప్రకారం తింటే బరువు పెరిగే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
కాల్చిన బంగాళాదుంపలతో ప్రయోజనాలు:
కాల్చిన బంగాళదుంపలు ఆరోగ్యానికి చాలా మంచివి. బంగాళదుంపలను ఇలా తీసుకుంటే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కాల్చిన బంగాళాదుంపలో పొటాషియం, ఫాస్పరస్, బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు, కొవ్వు పదార్ధాలు ఉంటాయి. కాల్చిన బంగాళదుంపను తీసుకోవడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
1. సమృద్ధిగా పోషకాలు:
కాల్చిన బంగాళదుంపలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. చర్మ సంరక్షణకు సరిపడే అనేక రకాల పోషకాలు ఉంటాయి.
2. విటమిన్ల పుష్కలమైన మూలం:
ఉడికించిన బంగాళాదుంపలో విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. కాల్చిన బంగాళాదుంపలోనూ విటమిన్ సి ఉంటుంది. కాబట్టి బంగాళదుంప తినడం వల్ల శరీరానికి సమృద్దిగా విటమిన్లు అందుతాయి.
3. భాస్వరం సమృద్ధిగా ఉంటుంది:
కాల్చిన బంగాళదుంపలలో 25 శాతం ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. ఇందులో ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. గర్భధారణ సమయంలో దీన్ని తీసుకుంటే.. అది శిశువు మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది.
4. నోటిపూతలకు చెక్
నోటిలో అల్సర్ సమస్యలకు బంగాళదుంపలు చాలా చెక్ పెడుతాయి. కాబట్టి ఆ సమస్యతో బాధపడేవారు కచ్చితంగా బంగాళదుంపలు తినాలి. బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో గ్లూకోజ్ స్థాయిలు, ఆక్సిజన్, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3లు పుష్కలంగా ఉన్నందున ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పబడింది.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారాన్ని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Rajasthan Royals Captain: బ్రేకింగ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా యుజ్వేంద్ర చాహల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook