Mangoes vs Diabetes: వేసవి వచ్చిదంటే చాలు..తియ్య తియ్యని నోరూరించే మామిడి పండ్లు గుర్తొస్తాయి. ప్రస్తుతం మార్కెట్ నిండా మామిడి పండ్లు ఎక్కువగా కన్పిస్తున్నాయి. పోషకాల పరంగా అద్భుతమైన మామిడి పండ్లను డయాబెటిక్ రోగులు తినకూడదంటారు. ఓ రకంగా చాలామందిలో ఈ సందేహం ఉంది. అసలు తినవచ్చా లేదా అనేది. మామిడి పండ్లు తింటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయని అంటారు. కానీ ఇప్పుడు మనం నిజానిజాలేంటో చూద్దాం.
మామిడి పండ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఎంజైమ్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి గట్ హెల్త్ బాగుంటుంది. కానీ మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారని, రక్తంలో చక్కెర శాతం పెరుగుతుందని వారిస్తుంటారు. వాస్తవానికి మామిడి పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా 51 వరకూ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్ధాలు తినడం వల్ల నెమ్మదిగా జీర్ణం, సంగ్రహణ ఉంటాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు.
మామిడి పండ్లలో ఉంటే విటమిన్ ఎ, విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులోని పొటాషియం బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది. తీపిగా ఉన్నా సరే...మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇందులోని ఎమిలేజ్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్‌ను బ్రేక్ చేసి జీర్ణం సులభమయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య కూడా దూరమౌతుంది. ఇందులో ఉండే విటమిన్ కే కారణంగా ఎముకలు బలోపేతం అవుతాయి. ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది.
జర్నల్ న్యూట్రియంట్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం మామిడి పండ్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. స్థూలకాయంతో ఉన్న కొంతమందికి 12 వారాలపాటు మామిడి పండ్లు ఇచ్చి పరిశీలించగా బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడటం గమనించారు. అందుకే మామిడి పండ్లను బ్యాలెన్స్డ్ డైట్‌లో భాగంగా పరిగణించారు. ఇతర తీపి పదార్ధాల్లో ఉన్నట్టు కాకుండా మామిడిపండ్లలో తక్కువ కేలరీలుంటాయి. మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో దోహదం చేస్తుంది.
మరో అధ్యయనం ప్రకారం మామిడి పండ్లు బ్లడ్ గ్లూకోజ్ స్థిరంగా ఉంచడం, తిన్న తరువాత ఇన్సులిన్ లెవెల్స్ నియంత్రణలో ఉపయోగపడతాయి. సాధ్యమైనంతవరకూ మామిడి పండ్లను పెరుగు లేదా పెరుగన్నంతో కలిపి లేదా ఇతర పండ్లతో సలాడ్ తో కలిపి తింటే ఇంకా మంచిదంటారు. స్థూలంగా చెప్పాలంటే మామిడి పండ్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అంత వేగంగా పెరగవు. డయాబెటిక్ రోగులు మితంగా తీసుకోవచ్చు. కానీ షుగర్ యాడ్ చేసే రెడీ మేడ్ మామిడి ఉత్పత్తులు మాత్రం తినకూడదు.
Also read: Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook