నిద్రలేమి వల్ల ( sleeplessness ) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బాధపడుతుంటారు. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు ( Sleeping Tips ) పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.
-
కంటి నిండా ( Sound Sleep ) కునుకు కోసం మీరు ప్రతీ రోజు నిద్రకు ఉపక్రమించేందుకు ఒక టైమ్‌ను ఫిక్స్ చేసుకోండి. ఆ టైమ్ టేబుల్‌ను ఖచ్చితంగా పాటించండి.
-
పగటి పూట ( Afternoon Sleep ) నిద్రపోయే అలవాటును వెంటనే మానేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం నిద్ర వల్ల రాత్రి ఆలస్యంగా నిద్ర పడుతుంది. మరీ తప్పదు అనుకుంటే 30 నిమిషాలకు మించకుండా ప్రయత్నించండి. Also Read : Sarkari Naukri 2020 : హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
-
రాత్రి సమయంలో కాఫీ ( Coffee ) , టీ ( Tea ) లు మానేయాలి. వీటి వల్ల నిద్ర ఆలస్యం అవుతుంది. గోరువెచ్చని పాలు ( Milk ) తాగితే త్వరగా నిద్రపడుతుంది.
-
నిద్రా సమయంలో ఎలాంటి పని ఉన్నా దాన్ని పక్కన పెట్టండి. ఆ సమయంలో నిద్రకన్నా ఇంపార్టెంట్ మరేదీ లేదని గుర్తుంచుకోండి.
-
పీడకలలు ( Nightmares ) రాకుండా మధురమైన కలలు రావాలంటే.. పడుకునే ముందు మీ మనసుకు నచ్చిన విషయాలను గుర్తుచేసుకోండి.
-
నచ్చిన పాటలు వినడం లేదా నచ్చిన పుస్తకం చదవడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది. Also Read : Indian Railways: ఇది రైలు కాదు..సూపర్ అనకొండ
-
రాత్రి పూట చేసే స్నానం ( Bath Before Bed ) వల్ల శారీరక మలినాలు తొలగడంతో పాటు, మనసు తేలికపడుతుంది. త్వరగా నిద్రపడుతుంది.
-
ఆల్కహాల్ ( Alcohol ), సిగరెట్ ( Ciggarette ) లకు దూరంగా ఉండండి. కెఫిన్ ( Caffeine ) ఉన్న పదార్ధాలను తగ్గించండి. అనవసర విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే ప్రశాంతంగా ( Sound Sleep )నిద్రపడుతుంది
గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు వైద్యులను సంప్రదించగలరు. సరైనా సలహాం తీసుకోగలరు.