Scalp Pimples: తలపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కావున జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వానా కాలంలో శిరోజాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాతావరణంలో తేమ వల్ల తలలో దద్దుర్లు సమస్య రావడం చాలా సహజం. మీరు తలలో ఈ సమస్యతో బాధపడుతుంటే.. దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు తెలుపున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా మార్గాలున్నాయి. కానీ ఈ సమస్యకు గల కారణాలు చాలా మందికి తెలియదు. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాలుష్యం వల్ల స్కాల్ప్‌పై సమస్యలు:
కాలుష్యం వల్ల స్కాల్ప్ కురుపులు రావచ్చు. అందుకే కలుషిత వాతావరణంలోకి తలకు టోపి పెట్టుకోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
స్కాల్ప్‌ను పొడిగా ఉంచడం:
జుట్టు లేదా స్కాల్ప్ పొడిగా ఉంటే.. తలలో దద్దుర్ల సమస్య రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అటువంటి పరిస్థితిలో పొడి జుట్టు నుంచి రక్షణ పొందడానికి వెనిగర్ ఉపయోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీనితో పాటు.. నూనెతో జుట్టును మర్దన చేయడం అవసరమని పేర్కొన్నారు.
వెంట్రుకలను ఎప్పుడు మురికిగా ఉంచకండి:
స్కాల్ప్ మురికిగా ఉంటే.. దాని వల్ల కూడా స్కాల్ప్‌లో దద్దుర్లు సమస్య రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. స్కాల్ప్ శుభ్రంగా ఉండాలంటే వారానికి రెండు సార్లు తప్పనిసరిగా షాంపూతో తలస్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రసాయనాల ఉత్పత్తులు వాడకండి:
జుట్టులో ఎక్కువ రసాయనాలను ఉపయోగిస్తే.. తలలో మొటిమల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించకూడదని వారు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీరకట్లులోనూ అందాలని అస్సలు దాచట్లేదుగా!
Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.