Magnesium Deficiency: మెగ్నీషియం లోపిస్తే కలిగే అనారోగ్యాలు.. తప్పించుకోవడం ఎలా?

Magnesium Health Tips: మన శరీరానికి అవసరమైన పోషక విలువల్లో ఏది లోపించిన సమస్యలు తలెత్తుతాయి. మరి మెగ్నీషియం లోపిస్తే మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటామో తెలుసుకుందాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 1, 2024, 02:45 PM IST
Magnesium Deficiency: మెగ్నీషియం లోపిస్తే కలిగే అనారోగ్యాలు.. తప్పించుకోవడం ఎలా?

Magnesium Deficiency: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్లతో పాటు ఖనిజాలు కూడా ఎంతో అవసరం. శరీరంలో వీటి సమతుల్యత ఏమాత్రం తప్పిన ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవు. శరీరానికి అవసరమైన ముఖ్య పోషకాలలో మెగ్నీషియం కూడా ఒకటి. మన శరీరంలో మెగ్నీషియం లోపించినట్లయితే కొన్ని లక్షణాల ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు. 

మెగ్నీషియం వల్ల శరీరానికి జరిగే మేలు ఏమిటి?

మన శరీరంలోని ప్రధాన అవయవాలకు మెగ్నీషియం ఎంతో అవసరం. ఇది కండరాల పనితీరుని మెరుగుపరచడంతో పాటు నరాలకు బలాన్ని చేకూరుస్తుంది. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి మెగ్నీషియం ఎంతో అవసరం. మన రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రణలో ఉంచడానికి కూడా మెగ్నీషియం ఎంతో ముఖ్యం. 

మెగ్నీషియం లోపానికి సూచనలు:

మన శరీరంలో మెగ్నీషియం లోపించింది అన్న విషయాన్ని చిన్న చిన్న లక్షణాల ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు. మెగ్నీషియం అవసరమైన మోతాదు కంటే తక్కువగా ఉన్నవారు తరచూ నీరసంగా ఉండడం, వికారం వంటివి ఫీల్ అవ్వడం జరుగుతుంది. నరాలలో సూదులు పెట్టి గుచ్చిన నొప్పిని వీళ్ళు అనుభూతి చెందుతారు. కాళ్లు పట్టేసినట్టు.. తిమ్మిర్లు పట్టినట్టు ఎక్కువగా అనిపిస్తుంది. మీకు ఇటువంటి లక్షణాలు ఉంటే ఇవన్నీ మెగ్నీషియం లోపానికి సూచనలు.

మెగ్నీషియం లోపిస్తే కండరాలు బలహీన పడడంతో పాటు గుండెదడ కూడా వస్తుంది. ఆకలి వేయదు. తలనొప్పి, మైగ్రేన్ వంటివి తలెత్తుతాయి. కాబట్టి మెగ్నీషియం లోపాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకండి. మెగ్నీషియం లోపించిన వారు నిద్రలేమి సమస్యతో కూడా బాధపడతారు. కాబట్టి పైన చెప్పిన ఎలాంటి లక్షణాలు మీలో కనిపించిన మీరు తీసుకునే ఆహారంలో అధికమవుతాదిలో మెగ్నీషియం ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

మెగ్నీషియం పెంచే తిండి పదార్థాలు:

సోయాతో చేసిన ఉత్పత్తుల్లో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. జీడిపప్పు ,బాదంపప్పు, వాల్నట్స్, పాలకూర, చియా సీడ్స్, గుమ్మడి గింజలు లాంటి వాటిలో మెగ్నీషియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. వీటితో పాటుగా తాజా పండ్లు ,కూరగాయలు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే కుదిరినప్పుడు కాసేపు ఎండలో తిరగడం.. వ్యాయామం ,యోగా వంటివి చేయడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకుంటే.. మీకు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

Also Read: Kadiyam Kavya - Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..

Also Read: Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News