Health Benefits of Ram Kand: అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మనం శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పండు గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాస సమయంలో ఈ కందమూలాన్నే ఎంతో ఇష్టంగా తినేవాడని నమ్ముతారు. అంతేకాదు ఈ పండు ఆయుర్వేదపరంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
మన పురాతన కాలం నుంచి శ్రీరామునికి సంబంధించిన ఎన్నో కథలు వినిపిస్తున్నాయి. అందులో ఈరోజు మనం చెప్పుకోబోయే పండు కూడా ఒకటి. హిందూ నమ్మకాల ప్రకారం శ్రీరాముడు తన వనవాస సమయంలో 14 ఏళ్లు కందమూల అనే ఫలాన్ని సేవించినట్లు చెబుతారు. ఈ పండు ప్రత్యేకతను కలిగి ఉంది ఎందుకంటే దీన్ని సాగు చేయరు. స్వతహాగా పొలాలు, అడవులలో పెరుగుతుంది. కందముల్‌ను చాలా చోట్ల రామ్ ఫాల్ లేదా రామ కందముల్ అని కూడా పిలుస్తారు. ఈ పండు తింటే త్వరగా ఆకలి వేయదు, శరీరానికి శక్తి వస్తుంది. ఇందులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి.
కీళ్ల నొప్పులకు చెక్..
సాధారణంగా ఈ కంద మూల్ చూడటానికి డ్రమ్ము ఆకారంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండును ఎక్కువగా వినియోగిస్తాం. ముఖ్యంగా ఈ పండు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నిజానికి, ఇది కీళ్ల నొప్పులు ,వాపు నుండి ఉపశమనం కలిగించే శోథ నిరోధక లక్షణాలను కలిగిన పండు.
రోగనిరోధక శక్తి..
రామ కందమూలంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండు తినడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. జలుబు, దగ్గు నుండి కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గుతారు..
ఈ రామకందమూలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో చాలాసమయం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. మళ్లీ మళ్లీ ఆకలి అనిపించదు, అంటే ఈ పండు అతిగా తినకుండా నిరోధిస్తుంది. జీవక్రియను కూడా పెంచే శక్తి దీనిలో ఉంది. ఇది కొవ్వు, కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. మొత్తానికి ఈ కందమూలాన్ని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
ఉబ్బసం తగ్గిస్తుంది..
దగ్గు, ఆస్తమా ,బ్రోన్కైటిస్‌తో బాధపడుతున్న రోగులు ఈ రాంకంద పండు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వాస్తవానికి, దీని మూలాలు ఎక్స్‌పెక్టరెంట్ ,బ్రోంకోడైలేటర్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే ఈ పండును తీసుకోవడం వల్ల దగ్గు అనేక రకాల శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
బలమైన జీర్ణవ్యవస్థ..
రామకందను తీసుకోవడం జీర్ణ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు నయమవుతాయి. అంతేకాదు దీని రెగ్యులర్ వినియోగం మలబద్ధకం, కడుపు నొప్పి ,తిమ్మిరి వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఈ విశేషాలు తెలుసా..
Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్ వంశీయులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter