Seeds: ఈ పది సీడ్స్ రోజు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. డాక్టర్ ను కలవాల్సిన అవసరమే లేదు

Seeds In Daily Diet: విత్తనాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని వైద్యులు చెబుతుంటారు. ప్రతిరోజు ఉదయం పరగడుపున గింజలు, విత్తనాలు తినాలి. దీంతో రోజంతటికి కావలసిన శక్తి అందుతుంది. ఇమ్యూనిటీ బలపడి పరిస్థితి అంతేకాదు ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది అయితే ప్రతిరోజు మన డైట్ లో ఉండాల్సిన 10 గింజలు ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Nov 14, 2024, 03:53 PM IST
Seeds: ఈ పది సీడ్స్ రోజు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. డాక్టర్ ను కలవాల్సిన అవసరమే లేదు

Seeds In Daily Diet: విత్తనాల్లో సహజసిద్ధమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రొటీన్స్‌, మినరల్స్‌, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. విత్తనాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజూ డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో మీ శక్తి రెట్టింపు అవుతుంది. పది శక్తివంతమైన విత్తనాలు ఏంటో తెలుసుకుందాం.

చియా విత్తనాలు..
విత్తనాలు చిన్నగా నల్లగా ఉండే ఆహారంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు సూపర్ ఫుడ్ తో మనకు రోజంతటికి కావాల్సిన శక్తి అందుతుంది. అంతేకాదు వీటిని స్మూథీల రూపంలో తీసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ గింజలతో మలబద్ధక సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

అవిసె గింజలు..
మనకు తెలిసింది అవిస గింజలో చర్మం జుట్టుతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే లిగ్నన్స్ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ మూలాలను కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు అవిస గింజలను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

గుమ్మడి గింజలు..
ఉమ్మడి గింజలు కూడా గుండె ఆరోగ్యానికి  మేలు చేస్తాయి, జీర్ణ క్రియను మెరుగు చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. గుమ్మడి గింజలను స్నాక్ రూపంలో తీసుకోవచ్చు వేయించి తీసుకోవడం వల్ల కూడా మెరుగైన లాభాలు కనిపిస్తోంది. ఇందులో మెగ్నీషియం, జింక్, యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్..
ఈ పొద్దు తిరుగుడు గింజల్లో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. గుప్పెడు పొద్దుటూరు గింజలు రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలకు స్నాక్ రూపంలో కూడా అందించవచ్చు.

నువ్వులు..
నువ్వులు మన వంట గదిలో ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. వివిధ వంటల్లో ఉపయోగిస్తాం వీటిని సలాడ్‌ రూపంలో కూడా తీసుకుంటారు. ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వుల్లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఎనీమియా సమస్య కూడా చెక్ పెట్టొచ్చు.

గసాలు..
ఈ చిన్న చిన్న గింజల్లో క్యాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది ఇది కూడా జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది మన డైట్ లో చేర్చుకుంటే రోజున కావలసిన శక్తి అందుతుంది సలాడ్స్ మోదిస్లో సులభంగా తీసుకోవచ్చు.

పుచ్చకాయ గింజలు..
ఈ పుచ్చకాయ గింజలు కూడా డైట్లో చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది ఇందులో ఆరోగ్యానికి మజిల్ బిల్డింగ్ కి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఐరన్ ఉంటుంది.

జీలకర్ర..
జీలకర్ర జీవన ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వంటల్లో వినియోగిస్తాం ఈ రుచికరమైన మసాలాతో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి ప్రేరేపిస్తుంది. డైట్ లో చేర్చుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది.

ఇదీ చదవండి:  అచ్చ తెలుగు గోంగూర పప్పు.. ఇలా చేశారంటే ఒక్క ముద్ద మిగలదు..

సోంపు..
సోంపు యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో సమస్యకు చెక్ పెడుతుంది. పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత సోంపు గింజలను నోట్లో వేసుకుని అలవాటు తెలుగు సంప్రదాయంలో ఉంది.

క్వినోవా..
క్వినోవా లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి జీర్ణ క్రియను వెలుగు చేస్తాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు క్వినోవా తినాలి ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. ఇందులో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

ఇదీ చదవండి:  ఒక చుక్క కొబ్బరి నూనెతో ముఖంపై ఒక మచ్చ.. గీత కూడా కనిపించదు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News