Vomiting Problems: తరచుగా జర్నీలో వాంతులతో అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

Vomiting Problems: కారులో లేదా రైలులో, బస్సులో ప్రయాణిస్తున్న సమయాల్లో చాలా మందికి పలు రకాల సమస్యలు వస్తాయి. జర్నీ అంటే ఇష్టం ఉన్న.. ఇలాంటి సమస్యల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలు రావడం వెనుక అంశాలేంటో తెలుసుకోలేకపోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 03:23 PM IST
  • తరచుగా జర్నీలో వాంతులతో బాధపడుతున్నారా..
  • వాంతులు వస్తే ఏం చేయాలి?
  • లవంగాల తినడం వల్ల వాంతులు రావు
Vomiting Problems: తరచుగా జర్నీలో వాంతులతో అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

Vomiting Problems: కారులో లేదా రైలులో, బస్సులో ప్రయాణిస్తున్న సమయాల్లో చాలా మందికి పలు రకాల సమస్యలు వస్తాయి. జర్నీ అంటే ఇష్టం ఉన్న.. ఇలాంటి సమస్యల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలు రావడం వెనుక అంశాలేంటో తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో ప్రయాణం చేస్తున్న సమయంలో మోషన్ సిక్‌నెస్, వాంతులు వంటి సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా జర్నీలో అవస్తలు పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఏం చేయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాంతులు వస్తే ఏం చేయాలి?:

మోషన్ సిక్‌నెస్, ఫుడ్ పాయిజనింగ్, పేలవమైన జీర్ణక్రియ మొదలైన కారణాల వల్ల వాంతులు వస్తాయి. అటువంటి పరిస్థితిలో కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యల నుంచి ఎలా విముక్తి పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిని తింటే వాంతులు అస్సలు రావు:

1. లవంగాలు:

లవంగం ప్రతి ఇంట్లో సులువుగా దొరికే ఓ సుగంధ ద్రవ్యం.. వాంతులు, వికారం నియంత్రణకు లవంగం ఎంతో మేలు చేస్తుంది.. లవంగాన్ని నోటిలో వేసుకుని నెమ్మదిగా నమిలితే.. వాంతులు రావని నిపుణులు చెబుతున్నారు.

2. సోపు:

ప్రతి హోటల్లో తిన్న తరువాత సోపు ఇవ్వడం ఓ అలవాటుగా మారిపోయింది.ఇది మౌత్‌ను ఫ్రెష్‌గా చేయడంమే కాకుండా వాంతిని ఆపడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వీటిపై ప్రభావవంతంగా పనిఐ చేస్తుంది.
 
3. నిమ్మకాయ:

నిమ్మకాయలో ఉండే గుణాలు వాంతులను నియంత్రించేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి ఈ సమస్యను నివారించడానికి కృషి చేస్తుంది. కావున జర్నీ సమయంలో నిమ్మ రసం త్రాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా తగడం వల్ల వాంతులు రాకుండా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.

4. ఏలకులు:

పచ్చి ఏలకులు తీసుకోవడం వల్ల వికారం, వాంతులు వంటి సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీరు దానిని ఏ విధంగానైనా తినవచ్చు. దీన్ని నమిలి తింటే చాలా ప్రయోజనం ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేయకండి.. ఈ విధంగా చేస్తే సమస్యలు తప్పవు..!

Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News