Weight Loss In 8 Days: కాకరకాయను తినని వారు చాలా మంది ఉన్నారు. కానీ దీనిలో చాలా రకాల పోషకాలున్నాయి. కావున కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 100 గ్రాముల కాకరలో 34 కేలరీలు, 13 మిల్లీగ్రాముల సోడియం, 602 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కావున దీని నుంచి తీసిన రసాన్ని తాగితే మధుమేషం వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా వీటి తొక్కల మిశ్రమం చర్మానికి రాసుకుంటే అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కాకర వల్ల ఎలాంటి అనార్యోగ్య సమస్యలు దూరమవుతాయో తెలుసుకుందాం..
కాకర వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మ సమస్యలు దూరమవుతాయి:
కాకర తొక్కలో చర్మాన్ని మెరుగుపరిచే వివిధ రకాల మూలకాలున్నాయి. అయితే కాకరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా పరిమాణంలో ఉంటాయి. కావున వీటి రసాన్ని చర్మాన్ని రాసుకోవడం వల్ల వివిధ రకాల సమస్యలు దూరమవుతాయి.
బరువు నియంత్రణలో ఉంటుంది:
కాకరకాయలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటాయి. కావున బరువును నియంత్రించేందుకు ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో కొవ్వు, కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. ఊబకాయాన్ని తగ్గించే కృషి చేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. కావున వీటిని క్రమంత తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బలోపేతం చేయడానికి ప్రభావవంతంగా కృషి చేస్తాయి.
కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది:
కాకర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కావున శరీరంలో అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook