Weight Loss With Millet Flour And Water Chestnut Flour: కాలం మారుతున్న కొద్ది జీవనశైలి శరవేగంగా మారిపోతోంది. దీని కారణంగా మనుషుల ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది. పెరుగుతున్న పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందిలో మధుమేహం, గుండె జబ్బులు, బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చాలామందిని వెంటాడుతున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య వస్తుంది. బరువు పెరగడం వల్ల ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఇది పై తీవ్రవ్యాధులన్నింటికీ దారి తీయవచ్చు. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం చాలామంది బరువు పెరగడం కారణంగా వచ్చి దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో పెట్టుకుంటున్నారు. దీనికోసం బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది జింమ్ తో పాటు వ్యాయామాలు చేస్తుంటే మరి కొంతమంది డైట్లను పాటిస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని పండ్లతో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తీసుకుంటే శ్రమలేకుండా సులభంగా బరువు తగ్గొచ్చు.
జొన్న పిండి:
బరువు తగ్గడానికి జొన్నపిండి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో గ్లూటెన్ పరిమాణాలు చాలా తక్కువగా లభిస్తాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ పిండితో తయారుచేసిన రోటీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
బాదం పిండి:
ఎండబెట్టి బాదాంలనుపొడిలా తయారు చేసుకొని పాలలో కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బాదంలో ప్రొటీన్లు సమృద్ధిగా, తక్కువ కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. అలాగే బాదం పిండిని ప్రతిరోజు వినియోగించడం వల్ల మెదడు కూడా మెరుగుపడుతుంది.
Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్ కేవలం రూ.12,499కే..ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు..
మిల్లెట్ పిండి:
మిల్లెట్ పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కూడా ఈ పిండిని వినియోగిస్తే రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాటర్ చెస్ట్నట్ పిండి:
ఈ వాటర్ చెస్ట్నట్ పిండి చాలా అరుదుగా లభిస్తుంది. ఈ పిండితో తయారుచేసిన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో కేలరీలు తక్కువగా లభిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి