Banana & Mango Shake Reduce 5Kg Weight in 5 Days: మండే వేడి నుంచి శరీరానికి ఉపశమనం కల్పించేందుకు చాలా మంది ప్రస్తుంత శీతల పానీయాలు, ఐస్‌క్రీం, జ్యూస్‌లు, షేక్‌లు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ప్రభాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన పండ్లతో తయారు చేసిన షేక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా హైడ్రేషన్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి పండ్లతో తయారు చేసిన షేక్స్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అరటి పండ్లు శరీర బరువును తగ్గిస్తుంది:
అరటిపండులో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన పదార్ధాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని తగ్గిస్తుంది.అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలను దూరం చేయడానికి కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అరటిపండులో ఉండే ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు అరటి పండ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
మామిడి పండ్లు కూడా శరీర బరువును తగ్గిస్తాయి:
వేసవి మామిడి విచ్చలవిడిగా లభిస్తాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు మామిడి పండ్లను తినడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ అధిక లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన జ్యూస్‌లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా రక్త కణాలను శుద్ధి చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు తినడం వల్ల శరీర బరువు తగ్గుతారు.
మామిడి, అరటి పండ్ల షేక్స్ తాగితే బరువు తగ్గొచ్చా?:
మామిడి, అరటి పండ్లతో తయారు చేసిన మామిడి షేక్‌లో 170 కేలరీలు లభిస్తాయి. బనానా షేక్‌లో 150 కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు వ్యాయామాలు చేసిన తర్వాత ఈ షేక్‌లను తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ షేక్స్ తాగాల్సి ఉంటుంది.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి