Weight Loss With Fennel Seeds: బరువు తగ్గే క్రమంలో పాటించే నియమాలు కీలక పాత్ర వహిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు వైద్యుల సలహా మేరకో.. నిపుణులు సూచించిన మేరకో తప్పకుండా పలు రకాల నియమాలు పాటించడం ఆనవాయితీ. బరువు తగ్గడానికి చాలామంది కష్టపడి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వారు ఎలాంటి ఫలితం పొందలేక పోతారు. ఇది సహజమే అయితే నిపుణులు సూచించిన మేరకు పలు చిట్కాలు పాటిస్తే ఎలాంటి వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గొచ్చని వారు చెబుతున్నారు. ఈ చిట్కాల్లో భాగంగా పలు ఆహార నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రసం బరువు తగ్గడానికి కీలక పాత్ర పోషిస్తుంది:
అందరికీ జీర్ణం సులభంగా అయ్యేందుకు వినియోగించే సోపు తెలిసింది. ఈ సోపుతో కూడా బరువు తగ్గొచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనికోసం ముందుగా సోపును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని.. తర్వాత పొడిని ఒక గ్లాసెడు నీటిలో వేసి.. ఇలా తయారు చేసిన దాన్ని రాత్రంతా పక్కన పెట్టాలి. ఆ తర్వాత దీనిని ఖాళీ కడుపుతో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ రసంతో ఇలా బరువు తగ్గుతారు..?:
సోపులో ఉండే గుణాలు బరువును సులభంగా నియంత్రించేందుకు సహాయపడతాయి. ఇందులో అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి శరీరానికి శక్తిని అందజేసి బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాలను నియంత్రించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు.. ఉదయం, రాత్రిపూట ఈ రసాన్ని తీసుకోవాలి.
ఈ రసం తీసుకోవడం వల్ల స్త్రీలకు కలిగే ఉపయోగాలు:
మహిళలకు పీరియడ్ సమస్యలు సర్వసాధారణం. అయితే ఇదే క్రమంలో వివిధ రకాల అనారోగ్య వస్తాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సోపుతో తయారుచేసిన రసం ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను కూడా దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని మెరిపించేందుకు కూడా కృషి చేస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook