Guava for Didabetics: డయాబెటిస్ ఉన్నవారు ఆహర పదార్థాలను తీసుకున్న తరువాత శరీరంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావం చూపుతుందో తప్పక తెలుసుకోవాలి. డయాబెటిస్ ఆరోగ్యకర పండ్లను తినటంలో సందేహ పడకూడదు ముఖ్యంగా జామపండ్లు. జామపండ్లు డయాబెటిస్ లకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ లను కలిగి ఉండటమే కాకుండా, ఇతర ప్రయోజనాలు కూడా కలిగిస్తాయి.
గ్లైసిమిక్ ఇండెక్స్ ల ద్వారా శరీరంలో కార్బోహైడ్రేట్లు జీర్ణం చెందించబడి, రక్త ప్రవాహంలో ఎంత శాతం వరకు చక్కెరలను విడుదల చేస్తున్నాయని తెలుసుకునే ప్రక్రియగా పేర్కొనవచ్చు. చక్కెర స్థాయిలు అధికం అవటం వలన రక్తంలో కూడా చక్కెర స్థాయిలు అధికమై, ఇన్సులిన్ విడుదలను కూడా అధికం అవుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ స్థాయిలు పెరగటం వలన శరీరంలోని చక్కెరలు కొవ్వు పదార్థాలుగా, ట్రైగ్లిసరైడ్ లుగా, నిల్వ చేయబడి, రక్త పీడన స్థాయిలు పెరుగుతాయి.
Also Read: Watch Video: కేరళలో వర్ష బీభత్సం...నదిలో కొట్టుకుపోయిన ఇల్లు..!
కావున, వీటి వలన కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి మనకు తెలిసిందే, జామపండు తినటం వలన వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. జామపండ్లను తినటం వలన డయాబెటిస్ ఉన్న వారికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
అధిక స్థాయిలో లైకోపీన్
జామపండ్లు అధిక మొత్తంలో లైకోపీన్ లను కలిగి ఉండి మరియు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రోస్టేట్ క్యాన్సర్ ను నియంత్రిస్తాయి. ఇతర వృక్ష సంబంధిత ఆహారాలతో పోలిస్తే, వీటి వలన కలిగే లాభాలు అధికమనే చెప్పాలి.
చక్కెర గ్రహణను తగ్గిస్తాయి
జామపండును వాటి పై ఉండే బాహ్యచర్మం లేదా పై పొర తొలగించకుండా తినటం వలన రక్తంలో చక్కెరలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని I-షౌ యూనివర్సిటీ వారు తెలిపారు.
మలబద్దక నియంత్రణ
చాలా మంది డయాబెటిక్ పేషంట్స్ మలబద్దకంతో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, జామపండును తినటం వలన పేగు కదలికలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడతాయి. వీటిలో ఉండే ఫైబర్ స్థాయిలు మలబద్దక స్థాయిలను పూర్తిగా తగ్గిస్తాయి. వీటితో పాటుగా టైప్-2 డయాబెటిస్ అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
రక్తప్రసరణలో మెరుగుదల
జామపండ్లను తినటం వలన రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఫలితంగా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా, పొటాషియంలు రక్త పీడన స్థాయిలను నియంత్రిస్తాయి.
కణాలు ప్రమాదానికి గురవటాన్ని నివారిస్తాయి
Also Read: Samantha New Conditions To Directors: నయన్ దారిలో సమంత.. దర్శకులకు కొత్త కండీషన్లు
జామపండులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ 'C', కణాలు ప్రమాదానికి గురవటాన్ని పూర్తిగా నివారిస్తాయి. ఫలితంగా, క్యాన్సర్ వ్యాధికి గురయ్యే అవకాశాలు కూడా తగ్గుస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook