Blood Cancer Types: విస్తృతంగా కనిపించే అనారోగ్య సమస్యలలో బ్లడ్ క్యాన్సర్ ఒకటి. కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులలో 8 శాతం బ్లడ్ క్యాన్సర్ నుంచే వస్తున్నాయి. ప్రపంచంలో బ్లడ్ క్యాన్సర్ బాధితులు అధికంగా అమెరికా, చైనాలో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.
బ్లడ్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి ఏడాది మే 28న వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే (World Blood Cancer Day 2021) నిర్వహిస్తున్నారు. రక్త క్యాన్సర్ కారకాలు, దేనివల్ల బ్లడ్ క్యాన్సర్ (Cancer Medicine) వ్యాధి బారిన పడుతున్నారు, చికిత్స ఎక్కడ తీసుకోవాలి లాంటి విషయాలు మెడల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటేడ్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఎస్ సుదర్శన్ దహెల్త్‌సైట్‌కు వివరించారు. బ్లడ్ క్యాన్సర్ 10 లక్షల మందిలో 35 మందికి వస్తుంది.
Also Read: Pfizer COVID-19 Vaccine: భారత్‌కు 50 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల సరఫరాకు అమెరికా ఫార్మా సంస్థ రెడీ
ప్రశ్న 1) భారత్‌లో సాధారణంగా తలెత్తే బ్లడ్ క్యాన్సర్ సమస్య, రకాలు ఏమిటి? అందుకు కారణాలు?
జవాబు; భారత్‌లో సాధారణంగా వచ్చే బ్లడ్ క్యాన్సర్ రకాలు.. లింఫోమా, ల్యుకేమియా, మైలోమా
ఈ బ్లడ్ క్యాన్సర్ కారకాలు, అందుకు దారితీసే పరిస్థితులు ఇవే
- జన్యుపరమైన అసాధారణ పరిస్థితులు
- ధుమపానం మరియు మధ్యపానం
- రేడియేషన్ మరియు హానికరాక రసాయనాలు శరీరంలో పడటం
- కుటుంబ సభ్యులలో బ్లడ్ క్యాన్సర్ ఉండటం (వంశపారపర్యంగా సమస్య)
- ఎండీఎస్, అప్లాస్టిక్ అనీమియా లాంటి హెమటోలాజికల్ అసాధారణత పరిస్థితులు
- లింఫోమస్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, ఇమ్యునో డెఫిషియెన్సీ కండీషన్, ఈబీవీ, HTLV -1 వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు కారణం
Also Read: Health Tips: మామిడి పండు తిన్నాక ఈ పదార్థాలు తినకూడదు, నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు
ప్రశ్న 2) బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో తలెత్తే సవాళ్లు ఏమిటి, తమ ఆరోగ్యంపై ప్రజలకు ఏ మేర అవగాహణ కలిగి ఉంటారు?
జవాబు: బ్లడ్ క్యాన్సర్ (Cancer Remedies) గురించి ప్రజలకు అంతగా అవగాహనా ఉండదు. అందులో చదువుకోని వారు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి దీనిపై తక్కువ విషయాలు తెలుస్తాయి. లక్షణాలు కనిపించినా వారికి దాని ప్రభావం తెలియకపోవడంతో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోకపోవడం వ్యాధి తీవ్రతకు కారణం అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. చికత్స ఖర్చులు అందరూ భరించలేరు. కొందరు తమ సమస్యపై అవగాహన లేకపోవడంతో రక్తదానం సైతం చేయడం, తద్వారా మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.
ప్రశ్న 3) స్త్రీలతో పోల్చితే పురుషులలో అధికంగా బ్లడ్ క్యాన్సర్ బారిన పడతారా?
జవాబు: క్యాన్సర్, ఆటోఇమ్యూన్ సంబంధిత అనారోగ్య సమస్యలో లింగ భేదాలుంటాయి. క్యాన్సర్ లాంటి సమస్యలు పురుషులలో అధికంగా సంభవిస్తుండగా, ఆటోఇమ్యూన్ సమస్యలు స్త్రీలలో అధికంగా వస్తాయని డాక్టర్ తెలిపారు. ధూమపానం, మధ్యపానం లాంటివి చేయడం వల్ల పురుషులతో క్యాన్సర్ బాధితులు అధికం. జీవన విధానం, ఆహారపు సైతం మగవారికి త్వరగా క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి.
Also Read: Milk Benefits: ప్రతిరోజూ పాలు తాగితే Cholesterol పెరుగుతుందా, నిపుణులు ఏమన్నారంటే
ప్రశ్న 4) బ్లడ్ క్యాన్సర్ లేటెస్ట్ ట్రీట్‌మెంట్ రకాలు, ఈ వ్యాధిని జయించే వారి శాతం ఎంత?
బ్లడ్ క్యాన్సర్ సమస్యకు కీమోథెరపిక్ ఏజెంట్స్, బయోలాజిక్ ఏజెంట్స్, రేడియేషన్ థెరీపీ, బోనో నారో, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికత్సలు అందిస్తున్నారు. ల్యూకేమియా మరియు ఇతర క్యాన్సర్ సమస్యలకు మరిన్ని అధునాతన చికిత్సా విధానాలున్నాయి. బ్లడ్ క్యాన్సర్ రకాన్ని బట్టి చికిత్స విధానాలు మారుతుంటాయి. కోలుకునే రేటు సైతం పేషెంట్ల బ్లడ్ క్యాన్సర్ రకంపై ఆధారపడి ఉంటుంది. దాంతో పాటు వ్యక్తి వయసు, వ్యాధిని ఏ స్టేజ్‌లో గుర్తించారు లాంటి పలు అంశాలుంటాయి. చికిత్స చేస్తున్న సమయంలోనూ ల్యుకేమియా క్యాన్సర్ మరింత వ్యాప్తి చెందుతుందని డాక్టర్ ఎస్ సుదర్శన్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook