7th Pay Commission Budget 2023: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముహుర్తం దగ్గర పడుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్లో కీలక ప్రకటనలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 7వ వేతన సంఘం వేతన చెల్లిపులపై కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. డీఏ పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, బకాయి ఉన్న డీఏ చెల్లింపులను బడ్జెట్లో ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి ఈ ప్రకటనలు వెలువడితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
డీఏ పెంపు ప్రకటన ఈ బడ్జెట్లోనే ఉంటుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. కేంద్ర ఉద్యోగుల డీఏను ప్రభుత్వం ఏటా రెండుసార్లు పెంచుతోంది. ఈ పెరుగుదల ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలలో ఉంటుంది. ఈ ఏడాది డీఏ పెంపును బడ్జెట్‌తో కలిపి జీతం పెంచాలని కేంద్ర ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మార్చిలో డీఏ పెంపు ప్రకటన వచ్చే అవకాశ ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు 38 శాతం డియర్నెస్ అలవెన్స్‌ని పొందుతున్నారు. ఇది 41 లేదా 42 శాతానికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫ్యాక్టర్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై కేంద్ర నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం ఉన్న 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని కోరుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌కు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని గతంలో నిపుణులు పేర్కొన్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించడం ముసాయిదాలో చర్చకు వస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుతం 2.57 శాతం ప్రకారం.. 18000 (18,000 X 2.57 = 46260) మూల వేతనంపై ఉద్యోగులు రూ.46,260 పొందుతున్నారు. 3.68 శాతానికి పెంచితే ఇతర అలవెన్సులు మినహాయిస్తే జీతం 26000X3.68 = రూ.95,680 అవుతుంది.
అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. కరోనా సమయంలో 18 నెలల డీఏ చెల్లింపును ప్రభుత్వం నిలిపివేసింది. తమకు బకాయి ఉన్న డీఏను చెల్లించాలని ఉద్యోగుల నుంచి చాలా కాలంగా కోరుతున్నారు. పెండింగ్ డీఏ బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగుల ఖాతాలో ఒకేసారి భారీగా నగదు జమకానుంది.
Also Read: IND Vs NZ: శుభ్‌మన్ గిల్ Vs పృథ్వీ షా.. హార్ధిక్ పాండ్యాను ఆడుకుంటున్న నెటిజన్లు
Also Read: Ind Vs NZ: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ మెరుపులు వృథా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook