Aadhar Card Scams: భారతదేశంలో పౌరులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే ఈ కార్డులను అందజేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. ఆధార్ కార్డు జారీకి సంబంధించి పలు కీలక సూచనలు చేసింది. ఆధార్ కార్డ్ అప్టేడ్ పేరిట సోషల్ మీడియాలో మోసపూరిత లింక్స్ షేర్ అవుతున్నాయని.. ఎట్టి పరిస్థితుల్లో ఆ లింక్స్ పై క్లిక్ చేయోద్దని హెచ్చరించింది.
ఆధార్ అప్డేట్ కు సంబంధించి సైబర్ నేరగాళ్లు ఇటీవలే రెచ్చిపోతున్నారు. ఫేక్ లింక్స్ షేర్ చేసి వాటి ద్వారా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చని ఎరగా వేస్తున్నారు. అయితే కొందరు తెలియక వాటిపై క్లిక్ చేసిన క్రమంలో వాటి ద్వారా మన వివరాలను పూర్తి తస్కరించడంతో పాటు బ్యాంకుల్లోని డబ్బును కూడా ఖాళీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రజలంతా ఆధార్ కార్డు అప్డేట్ కోసం.. ఆ కార్డును జారీ చేసే సంస్థ UIDAI అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ లేదా mAadhaar App, my Aadhaar Portal లో లాగిన్ అవ్వాలి. ఇవి కాకుండా అనధికారిక లింక్స్ పై క్లిక్ చేయద్దని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సంబంధింత సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ఎల్లప్పుడూ నమ్మకం ఉంచాలని, సెప్టెంబరు 6న UIDAI ట్వీట్ చేసింది.
తస్మాత్ జాగ్రత్త..!
ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని గత కొంతకాలంగా ప్రభుత్వం ప్రజలను సూచిస్తోంది. అయితే ఈ క్రమంలో ఆధార్ అప్డేట్ పేరుతో కొన్ని ఫిషింగ్ లింక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి ఫ్రాడ్ లింక్స్ ద్వారా దేశవ్యాప్తంగా చాలా మంది మోసపోయినట్లు UIDAI స్పష్టం చేసింది. దీనికి అసలు కారణం.. అధికారిక వెబ్సైట్ మాదిరిగానే ఫేక్ లింక్స్ కనిపించడమే. ఈ క్రమంలో వ్యక్తిగత వివరాలను ఇతరులకు షేర్ చేసి మోసపోతున్నారు.
ఇలాంటి సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు కొన్ని కీలకమైన సూచనలు చేస్తున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన ఏదైనా వెబ్సైట్ ను సందర్శించే ముందు దానికి సంబంధించిన URL ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొదట దాని స్పెల్లింగ్ సరిగా చెక్ చేసుకొని.. ఆ తర్వాతే అన్ని వివరాలను సమర్పించాలని వెల్లడించారు.
Also Read: Chandrababu Case: బావ కడిగిన ముత్యంలా బయటికొస్తారు, అంతా కక్ష సాధింపే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook