న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభణ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ గులేరియా హెచ్చరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న విధానం ప్రకారం జూన్, జూలైలలో గరిష్ట స్థాయికి వచ్చే అవకాశం ఉందని, కానీ చాలా వేరియబుల్స్ ఉన్నాయని అన్నారు. ఈ యాదృచ్చికమైన పరిస్థితులు ఎంత మేర ప్రభావం చూపిస్తాయోనని, మరోవైపు లాక్‌డౌన్‌ను అమలు చేసే ప్రక్రియపై దీని వ్యాప్తి ఆధారపడ్డాయని ఉంటుందని కాలక్రమేణా అంచనా వేయవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ తయారిపై స్పష్టత లేనందున భవిషత్తు ఆందోళన తప్పదని వైరస్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్లో ప్రయత్నం చేస్తోందని అన్నారు.
మార్చి 25న ప్రారంభమైన లాక్డౌన్ చేసిన మొదటి రోజు భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య కేవలం 600 ఉండగా 13మంది మరణించారు. నేటి వరకు (గురువారం) లాక్డౌన్ ప్రారంభమైన 43 రోజులు కాగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య దాదాపు 53,000 కు చేరుకుంది. సుమారు 1,800 మంది మరణించారు.మరోవైపు దాదాపు 17,000 కేసులతో మహారాష్ట్ర, 6,500 కి పైగా కేసులతో గుజరాత్, 5,500 కి పైగా కేసులతో ఢిల్లీ ఉండగా.. దేశంలోని మొత్తం కోవిడ్ -19 కేసుల్లో సగానికి పైగా ఉన్న మొదటి మూడు రాష్ట్రాలుండటం ఆందోళనకరం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..