పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఎంఫాన్ తుఫాన్ ప్రభావం మొదలైంది. మధ్యాహ్నం సూపర్ సైక్లోన్ ఎంఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది.
ఒడిశా తీర ప్రాంతంలో 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు భారీగా వీస్తున్న ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు తుపాన్ తీరం దాటనున్న పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లాలోని డిఘా దీవుల వద్ద పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అలలు పోటెత్తుతున్నాయి. దీంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. డిఘా దీవుల వద్ద సముద్ర పరిస్థితిని ఈ కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH High tide at Digha in East Medinipur, as #CycloneAmphan is expected to make landfall today. #WestBengal
(Source: NDRF) pic.twitter.com/QMYTR0IYFS— ANI (@ANI) May 20, 2020
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..