Ayodhya Ram Mandir: రామాయణంలో విశ్వామిత్రుడు చేసే యజ్జాన్ని భగ్నం చేయడానికి మారీచ, సుబాహులు ఎలా అడ్డుపడ్డారో.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణ విషయంలో కొంత మంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు అనని మాటలను..అన్నట్లుగా చిలువలు.. పలువులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రామ మందరి ప్రతిష్ఠకు ఇది సరైన ముహూర్తమేనా.. కొంత కన్ప్యూజన్ చేసే ప్రయత్నం చేసారు. అందులోను మన దేశంలోని నాలుగు శంకరా చార్య పీఠాల్లో ఒకటైన శృంగేరి పీఠాధిపతి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మూహూర్తంతో పాటు ఆయన ఈ క్రతువులో పాల్గొన బోతున్నట్టు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు.అంతేకాదు దీనిపై శృంగేరి మఠం కీలకమైన ప్రకటన విడుదల చేసింది.
దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వర వారి ఆదేశానుసారం పవిత్ర జగద్గురువు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ, శృంగేరి మఠం యొక్క CEO మరియు నిర్వాహకులు, శ్రీ VR గౌరీశంకర్ గారు ఈ నెల జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో శృంగేరి పీఠం తరుపున పాల్గొనబోతనట్టు తెలిపారు.
ఈ సందర్భంగా శృంగేరి పీఠం తమకు సంబంధించిన సోషల్ మీడియాల ఫ్లాట్ఫారమ్ల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే భక్తులు గమనించాలని శృంగేరి మఠం జనవరి 8, 2024 నాటి ప్రకటనలో తెలియజేసింది.
ఈ సందర్భంగా ప్రముఖ నేషనల్ మీడియా రిపబ్లిక్ వరల్డ్ జనవరి 18, 2024 నాటి “శృంగేరి మఠం శంకరా చార్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు హాజరవుతున్నారనే శీర్షికన ఒక కథనాన్ని ప్రచురించింది. వారు ప్రచురించిన కథనంలో వచ్చిన తప్పుడు సమాచారాన్ని వెంటనే సరిదిద్దాలంటూ కోరారు.
ఈ కథనంలో కూడలి మఠాన్ని శృంగేరి మఠంగా తప్పుగా పేర్కొంది. ఈ మఠం శృంగేరి పీఠానికి దగ్గరలోని శివమొగ్గలో ఉంది. ఈ సందర్బంగా కూడలి పీఠాధిపతి ఫోటోకు బదులు శృంగేరి పీఠాధిపతి ఫోటోను తప్పుగా ప్రచురించిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్బంగా శృంగేరి మఠానికి చెందిన శంకరాచార్యులు అయోధ్య కార్యక్రమానికి హాజరవుతారని ప్రజలను తప్పుదారి పట్టించిన విషయాన్ని ప్రస్తావించారు.
శివమొగ్గ సమీపంలో ఉన్న కూడలి మఠం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం కాదు లేదా శృంగేరి మఠం అని పేర్కొనబడలేదు. ఇది శృంగేరి మఠం యొక్క స్వతంత్రంగా పనిచేసే శాఖ మఠం మాత్రమే.మీడియా కూడా పీఠాధిపతుల విషయంలో ఒకటికి రెండు సార్లు పొరపాట్లు జరగకుండా చూడాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేసారు.
శృంగేరి మఠంలోని శంకరాచార్యుల వారి ఆదేశానుసారం, రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే సుమూహర్తానా.. రామ తారక మంత్ర జపాన్ని ఆచరించమని కోరింది. జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన రామ భుజంగ స్తోత్రాన్ని పఠించి భగవాన్ శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కావాలని కోరింది.
Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్
Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter