Bhadrachalam Railway Line: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలుమార్గానికి మార్గం సుగమమైంది. భద్రాచల రామునికి రైలు మార్గం వస్తోంది. అయితే దిశ మాత్రం మారింది. ఎక్కడ్నించి..ఎక్కడికనేది పరిశీలిద్దాం.
భద్రాచలానికి ఓ ప్రాముఖ్యత ఉంది. దక్షిణాధి అయోధ్యగా పిలుస్తారు. ఇక్కడి శ్రీరాముని ఆలయం కారణంగా అంతటి విశిష్టత. చాలాకాలం నుంచి భద్రాచలానికి రైల్వే లైన్ రావాలనేది ఓ డిమాండ్. ఇందులో భాగంగానే ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్. ఈ కొత్త రైల్వే లైన్ సర్వే దశ దాటలేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ ప్రాజెక్టుకు మోక్షం కలగడం లేదు.
ఇప్పుడు భద్రాచలానికి రైల్వే మార్గం సుగమమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. దాదాపుగా రైల్వే మార్గం ఖరారైంది. అయితే దిశ మాత్రం మారింది. ఏపీ నుంచి కాకుండా...ఒడిశా నుంచి భద్రాచలానికి రైల్వేై లైన్‌కు కొత్తగా ప్రతిపాదన సిద్ధమై...కేంద్ర ప్రభుత్వం అంగీకారం పొందింది. ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ కొత్త ప్రాజెక్టుపై సమీక్ష పూర్తి చేశారు. కొత్త రైల్వే లైన్ ఏయే ప్రాంతాల మీదుగా, ఎక్కడి నుంచి ప్రారంభం కానుంది, సాధ్యాసాధ్యాలేంటనే విషయంపై చర్చించారు. కొత్త రైల్వే ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై భారీ వంతెన కూడా నిర్మాణం కావల్సి ఉంది.
ఒడిశా టు భద్రాచలం రైల్వే మార్గం
కొత్త రైల్వే మార్గాన్ని ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకూ వేయనున్నారు.173.41 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైను గిరిజన ప్రాంతాల్ని కలుపుకుంటూ రానుంది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రతిపాదించిన ఈ కొత్త రైల్వే లైనుకు రైల్వే బోర్డు 2021 సెప్టెంబర్ నెలలోనే ఆమోదం తెలిపింది. 2022 జూన్ నాటికి సర్వే పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుకు 2 వేల 8 వందల కోట్ల ఖర్చవుతుందని అంచనా. నదులు, వాగులు ఎక్కువగా ఉండటం, అటవీ ప్రాంతం కావడంతో 213 వంతెనలు నిర్మితం కానుండగా..ఇందులో 48 భారీ బ్రిడ్జిలున్నాయి. ఈ కొత్త రైల్వే లైన్ మల్కాన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్ పల్లి, లూనిమన్ గూడల మీదుగా తెలంగాణలోని కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకూ సాగుతుంది. అటు ఒడిశాలో జైపూర్ నుంచి మల్కాన్‌గిరి రైల్వే లైన్ ఇప్పటికే మంజూరైంది. ఆ లైనుకు విస్తరణే ఈ కొత్త లైన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.