Bihar Election 2020: గెదెపై వచ్చి నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి.. కారణం ఏంటో తెలుసా ?

Nomination On Bufffallo | బీహార్ ఎన్నికల ( Bihar Election 2020 ) వేడి మొదలైంది. రాజకీయ నాయకులు ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమ ప్రత్యర్థుల కన్నా తము ఎంత బెటరో చెప్పడానికి దిగ్గజ నేతలు ఏ అవకాశం వదలడం లేదు.

Last Updated : Oct 19, 2020, 11:14 PM IST
    • మొదలైన బీహార్ ఎన్నికల హడావిడి
    • గేదెపై వచ్చి నామినేషన్ వేసిన అభ్యర్థి
    • దేశ వ్యాప్తంగా చర్చల్లో నచారీ మండాల్
Bihar Election 2020: గెదెపై వచ్చి నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి.. కారణం ఏంటో తెలుసా ?

Nomination On Bufffallo | బీహార్ ఎన్నికల ( Bihar Election 2020 ) వేడి మొదలైంది. రాజకీయ నాయకులు ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమ ప్రత్యర్థుల కన్నా తము ఎంత బెటరో చెప్పడానికి దిగ్గజ నేతలు ఏ అవకాశం వదలడం లేదు. అదే సమయంలో ఎన్నికల ( Elections ) సమయంలో కనిపించే సాధారణ అంశాలతో పాటు.. ఈ సారి కొత్త చిత్రాలు కూడా ముందుకు వస్తున్నాయి. దానికి నిదర్శనమే ఈ సంఘటన.

ఈ ఫోటలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాచారీ మండల్. బీహార్ ( Bihar) రాష్ట్రంలోని బహాదుర్పూర్ నియోజక వర్గంలోని దర్భంగా నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు.

ఎన్నికల్లో పోటీలో దిగడానికి ముందు ఇతను తన నామినేషన్ వేయడానికి ఇలా గేదెపై బయల్దేరాడు. ఈ ఫోటో ఇప్పుడు దేశ వ్యాప్తంగా బాగా చర్చల్లో ఉంది. ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు ఎంత కష్టపడతారో చూడండి అని కొంత మంది నెటిజెన్స్ ( Netizens ) ఈ ఫోటోను చూసి కామెంట్ చేస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం వేరేలా ఉంది అనేది అతని చెప్పింది వింటే అర్థం అవుతుంది.

అయితే దీని గురించి స్పందించిన నాచారీ మాత్రం.. తను ఒక వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తిని అని.. సాధారణ రైతును అని తెలిపాడు. ఇతర నేతల్లా తనకు కార్లు లేవు అని.. అందుకే ఇలా గేదెపై వచ్చాను అని తెలిపాడు. కారణం ఏది అయినా అతని నామినేషన్ దాఖలు చేసే విధానం చాలా మందికి కొత్తగా అనిపించింది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News