Corbevax Vaccine: దేశంలో త్వరలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ రాబోతోంది. వ్యాక్సినేషన్, కరోనా మహమ్మారి నియంత్రణ విషయంలో గేమ్ ఛేంజర్ కానుందనే తెలుస్తోంది. అసలు ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏంటి..ఎందుకు గేమ్ ఛేంజర్ కానుంది.
ఇండియాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా అందులో భారత్ బయోటెక్ (Bharat Biotech) తయారు చేస్తున్న కోవాగ్జిన్ (Covaxin) పూర్తిగా మేకిన్ ఇండియా వ్యాక్సిన్. త్వరలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ రానుంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు ఇది పూర్తిగా ప్రత్యేకం. ఎందుకంటే అత్యంత సమర్ధతతోపాటు అత్యంత చౌకగా ఈ వ్యాక్సిన్ లభించనుంది. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్ గేమ్ ఛేంజర్ కానుందని తెలుస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ (Biological E) అభివృద్ధి చేస్తున్న కార్బెవాక్స్ (Corbevax) ప్రత్యేకత ఇది. త్వరలో ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి శుభవార్త అందుతోంది. దేశంలోనే అత్యంత సమర్ధవంతంగా, అత్యంత చౌకగా ఈ వ్యాక్సిన్ లభించనుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ (Phase 3 Trials) ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులో రావచ్చని తెలుస్తోంది. నోవావాక్స్(Novavax) లానే ఈ వ్యాక్సిన్ 90 శాతం సమర్ధతను ప్రదర్శించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు అతి తక్కువ ధరకే ఈ వ్యాక్సిన్ లభించవచ్చు. దాదాపు 250 రూపాయలకే వ్యాక్సిన్ అందుబాటులో రావచ్చు. సమర్ధవంతమైన, చౌకగా లభించే వ్యాక్సిన్ల కోసం ప్రపంచం..ఇండియాపై ఆధారపడే సమయం త్వరలోనే రానుందని నేషనల్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ వెల్లడించింది.
Also read: Edible Oils: గుడ్‌న్యూస్, వంట నూనె ధరలు భారీగా తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook