Bipin Rawat Helicopter Crash Updates 13 out of 14 dead in chopper crash, identities to be confirmed through DNA test: ANI : భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ( IAF Mi-17V5 helicopter) ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో (Bipin Rawat Chopper Crash) హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff Bipin Rawat) బిపిన్ రావత్ ఉన్నారు. అయితే హెలికాప్టర్‌లో మొత్తం 14మంది ప్రయాణించారు. ఇక ప్రస్తుతం ఒక్కరు మాత్రమే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన బిపిన్ రావత్ అయ్యి ఉంటారని తెలుస్తోంది.
Also Read : Bipin Rawat chopper crash: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌కి తీవ్ర గాయాలు
ఏఎన్‌ఐ (ANI) ప్రకారం.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff Bipin Rawat) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో పదమూడు 13 మంది మరణించారు. బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయిన వారి వివరాలు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీన్ని బట్టి బిపిన్ రావత్ భార్య మధులిక ప్రమాదంలో చనిపోయినట్లు నిర్దారణ అయ్యింది. డీఎన్‌ఏ (DNA) పరీక్షల ఆధారంగా ఈ మృతదేహాలను గుర్తించనున్నారు. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కాసేపటికే కూలిపోయింది.
13 of the 14 personnel involved in the military chopper crash in Tamil Nadu have been confirmed dead. Identities of the bodies to be confirmed through DNA testing: Sources
— ANI (@ANI) December 8, 2021
Also Read : బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై త్వరలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook