Bipin Rawat killed : హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి

Bipin Rawat, Wife Among 13 Killed : సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలడంపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది మృతి చెందారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2021, 09:36 PM IST
  • భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంలో
    బిపిన్ రావత్‌ మృతి
  • బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ తో పాటు 11 మందిమృతి
Bipin Rawat killed : హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి

Bipin Rawat Helicopter Crash Updates CDS General Bipin Rawat, wife, 11 others dead in helicopter crash: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక, మరో 11 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది. తమిళనాడులో ఈ విషాదం జరిగింది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ లో (IAF Mi-17V5 helicopter) సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మరో 13 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలకు గురైన బిపిన్‌ రావత్‌కు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.. దురదృష్టవశాత్తూ  బిపిన్ రావత్ కూడా ప్రమాదంలో మరణించారు. 

 

Also Read : Bipin Rawat death news: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌ మృతి

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (CDS General Bipin Rawat) వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సీడీఎస్ బిపిన్‌ రావత్‌ పాటు ఆయన భార్య మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారులు బయల్దేరారు. ఈ ప్రత్యేక విమానం ఉదయం 11.35 గంటలకు సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకుంది. సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి వారంతా ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయల్దేరారు. కాగా మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కట్టేరి‌‌-నంచప్ప చత్రం ప్రాంతంలో ఒక్కసారిగా బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తోన్నహెలికాప్టర్‌ కుప్ప కూలింది. ఈ ప్రాంతం కూనూరుకు సమీపంలో ఉంది.

ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్‌ దంపతులతో పాటు మొత్తం పదమూడు మంది మృతిచెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిపిన్‌ రావత్‌ దంపతులతో పాటు మరణించిన సైనికాధికారుల మృతదేహాలను రేపు ఢిల్లీకి తరలించనున్నారు.  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read : Bipin Rawat Helicopter Crash 13 dead : బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మొత్తం 14 మందిలో 13 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News