నెహ్రూ విగ్రహంపై నల్ల రంగు

శనివారం పశ్చిమ బెంగాల్ లోని కట్వా పట్టణంలో దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ విగ్రహానికి దుండగులు నలుపు రంగు చల్లారు.

Last Updated : Mar 18, 2018, 02:53 PM IST
నెహ్రూ విగ్రహంపై నల్ల రంగు

శనివారం పశ్చిమ బెంగాల్‌లోని కట్వా పట్టణంలో దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ విగ్రహానికి దుండగులు నలుపు రంగు చల్లారు. దీనికి బాధ్యులు బీజేపీ అని కాంగ్రెస్ నిందించినా.. ఈ అంశంతో తమకు సంబంధమే లేదని బీజేపీ స్పష్టం చేసింది.

శనివారం ఉదయం తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని కట్వా పట్టణంలోని టెలిఫోన్ మైదాన్ ప్రాంతంలో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ చర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ ఎదుట ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సంఘటన వెనుక బీజేపీ పార్టీ కార్యకర్తల హస్తం ఉందని కట్వా పట్టణం కాంగ్రెస్ కార్యదర్శి సుభాష్ష్ సమంతా ఆరోపించారు. బిజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి సందీప్ నంది తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. స్థానికులు ఫిర్యాదు చేశారని, ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కట్వా పురపాలక సంఘం ఛైర్మన్ రవీంద్రనాథ్ చటోపాధ్యాయ, విగ్రహానికి నలుపు రంగు చల్లడాన్ని ఖండించారు. అదేరోజు మునిసిపాలిటీ విగ్రహాన్ని శుభ్రపరిచిందని చెప్పారు.

మార్చి 7న, జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ప్రతిమను కోలకతాలో ఒక మహిళతో సహా ఏడుగురు వ్యక్తులు నాశనం చేశారు. ఇటీవలి కాలంలోనే కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్, సామాజిక సంస్కర్త రామస్వామి పెరియార్ మరియు భీమరావ్ అంబేద్కర్ విగ్రహాలను త్రిపుర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌లలో కొందరు దుండగులు విధ్వంసం చేశారు.

 

 

Trending News