CAA Protest: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల అభ్యంతరం, ఎంఐఎం నేత అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు

CAA Protest: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఏఏ అమలుపై తమకు అభ్యంతరాలున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2024, 06:10 AM IST
CAA Protest: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల అభ్యంతరం, ఎంఐఎం నేత అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు

CAA Protest: మరో నెల రోజుల్లో లోక్‌సభ ఎన్నికలనగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2019లో పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఎన్నికల వేళ హఠాత్తుగా ఈ చట్టాన్ని అమలు చేయడంపై ప్రతిపక్షాల్నించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

పౌరసత్వ సవరణ చట్టం చేసి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకూ అమలు చేయని చట్టాన్ని ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల ముందు తెరపైకి తీసుకురావడం వెనుక ఆంతర్యమేంటని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నిస్తున్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైనవారికి దేశంలో ఆశ్రయం కల్పించాలని కేంద్రానికి సూచించారు. 2019లో పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మతపరమైన హింసకు గురై ఇండియాకు వలస వచ్చిన హిందూవులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలకు పౌరసత్వం అందించాల్సి ఉంటుంది. అంటే విదేశాల్నించి వచ్చే అన్ని మతాలకు పౌరసత్వం కల్పిస్తారు. ముస్లింలకు మాత్రం కల్పించరు. దీనికోసం 2014 డిసెంబర్ 31 గడువు తేదీగా ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ తేదీలోగా ఇండియాకు వచ్చినవారు పౌరసత్వానికి అర్హులు. ఇండియాలో కనీసం 11 ఏళ్లు ఉండాలనే నిబంధనను ఐదేళ్లకు తగ్గించారు. 

మతపరమైన విభజనతో రూపొందిన చట్టం కావడంతో తీవ్ర నిరసనలు, ఆందోళనలు నడిచాయి. ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల సమయంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. 

Also read: What is CAA: సీఏఏ అంటే ఏమిటి..? ఈ చట్టం అమలుతో జరిగే మార్పులు ఏంటి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News