CBSE Board Exams Twice in a Year: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 10, 12 తరగతుల పబ్లిక్ పరీక్షల విధానం మార్చేందుకు యోచిస్తోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే సీబీఎస్ఈ విద్యార్ధులకు కీలకమైన మార్పు కావచ్చు.
సీబీఎస్ఈ విద్యార్ధులకు త్వరలో భారీ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. 10, 12 తరగతులకు ఏడాదికోసారి నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షల విధానంలో మార్పు రావచ్చు. త్వరలో ఏడాదికి రెండు సార్లు పబ్లిక్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో సీబీఎస్ఈ బోర్డు ఉంది. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చలు జరిగాయి. సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ ఛైర్మన్, సీనియర్ అధికారులు, కేంద్ర విద్యాశాఖ ప్రతినిధులు, సీబీఎస్ఈ స్కూల్స్‌తో ఈ సమావేశం జరిగింది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇకపై ఏడాదిలో రెండు సార్లు పబ్లిక్ పరీక్షలు జరగవచ్చు. రెండు దఫాల పరీక్షల మధ్య విరామం ఎక్కువగా ఉండటంతో విద్యార్థికి చదువుకునేందుకు సమయం ఉంటుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రతిపాదన త్వరలో విడుదల కానుంది. పరీక్షల సమయంలో విద్యార్ధులకు ఎదురౌతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కొత్త విధానంపై ఆలోచన చేస్తున్నారు. రెండు పరీక్షలు రాయడం తప్పనిసరి కాదు. ఆప్షనల్ మాత్రమే. మొదటి దఫా పరీక్షల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందకుంటే రెండోసారి రాయవచ్చు. జేఈఈ మెయిన్స్ ఏ విధంగా రెండు సార్లు నిర్వహిస్తున్నారా అదే విధంగా ఉంటుంది.
మరోవైపు సీబీఎస్ఈ బోర్డు దేశవ్యాప్తంగా 260 స్కూళ్లలో 2026-27 నుంచి గ్లోబల్ కరిక్యులమ్ అంటే కొత్త సిలబస్ ప్రవేశపెట్టనుంది.
Also read: Half Day Schools: విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, త్వరలో ఒంటి పూట బడులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి