Satellite Mapping: దేశ సరిహద్దుల విషయంలో కాదు..రాష్ట్ర సరిహద్దు వివాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తరచూ రావడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు(Northeastern states border disputes), హింసాత్మక ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అసోం(Assam), మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదం నేపధ్యంలో జూలై 26వ తేదీన జరిగిన హింసాత్మక ఘర్షణల్లో అసోంకు చెందిన 5మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా..60 మంది గాయపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా(Amit shah) రంగంలో దిగారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. సమస్యకు అర్ధవంతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయవద్దని కోరారు.
ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ ఎదురవుతున్న సరిహద్దు వివాదాలకు చెక్ పెట్టేందుకు శాటిలైట్ ఇమేజింగ్(Satellite imaging) సహాయం తీసుకోనున్నారు. ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ స్థూలంగా చెప్పాలంటే నెశాక్కు(NESAC) అప్పగించారు. రాష్ట్రాల సరిహద్దుల్ని శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ఖరారు చేయాలనే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం(Central government). ఇది శాస్త్రీయం కావడంతో కచ్చితత్వం ఉంటుందని..పరిష్కారం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. నెశాక్ నుంచి వచ్చే శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరగనుంది.1875లో అప్పటి బ్రిటీషు ప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న 509 చదరపు మైళ్ల ప్రాంతం తమదని మిజోరం(Mizoram)వాదిస్తుంటే..1993 సరిహద్దునే గుర్తిస్తామని అసోం అంటోంది.
Also read: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెంచిన పెట్రోలియం సంస్థలు, సిలెండర్‌పై 73 రూపాయలు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook