PM Garib Kalyan Yojana: దేశంలోని కోట్లాది మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నేటి నుంచి 81.35 కోట్ల మందికి ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని ప్రకటించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన) కింద 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. ఈ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడగించారు.
జనవరి 1 నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. నేటి నుంచి డిసెంబర్ 2023 వరకు 81.35 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం తెలిపింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2023 వరకు లబ్ధిదారులందరి నుంచి ఎటువంటి రేషన్ రుసుము వసూలు చేయట్లేదని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023లో కేంద్ర ప్రభుత్వం ఆహార సబ్సిడీపై రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.
కొత్త ఆహార భద్రతా పథకం కింద ప్రభుత్వం కోట్లాది మందికి ఉచిత రేషన్ ప్రయోజనాన్ని అందించనుంది. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కార్డు హోల్డర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. కరోనా కాలంలో ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే కరోనా మొదటి వేవ్ ముగియడంతో ఈ పథకం నవంబర్ 2020లో ఆపేశారు. మళ్లీ రెండో వేవ్ కరోనా కారణంగా ఈ పథకం మళ్లీ మే 2021లో ప్రారంభించారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోంది.
ఎఫ్‌సీఐ అధికారులు ప్రజలందరూ తమ పరిధిలోని దుకాణాలను తనిఖీ చేసి ఈ పథకం సక్రమంగా అమలవుతున్నారా లేదా అని నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు రేషన్ పంపిణీ చేసే డీలర్ మార్జిన్‌ను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రాల నుంచి సలహాలు కోరింది.
అయితే ఈ పథకం కొనసాగించడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. ఆర్థిక భారం ఒక అంశం అయితే.. అవసరాలకు సరిపడా గోధుమ నిల్వలు లేకపోవడం ఇబ్బందిగా మారనుంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, ఇతర సంక్షేమ పథకాల కేటాయింపుతోపాటు పీఎంజీకేఏ కోసం అదనపు అవసరాలకు సరిపడా గోధుమలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
Also Read: Earthquake In Delhi: ఢిల్లీలో అర్ధరాత్రి భూకంపం.. భయంతో జనం పరుగులు
Also Read: LPG Cylinder Price Hike: న్యూ ఇయర్ తొలి రోజే షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి