CNG Prices Hiked: పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు బాటలోనే సీఎన్జీ ధరలు సైతం పెరుగుతున్నాయి. ఉత్తరాదిన.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, నొయిడా, గ్రేటర్ నొయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, కర్నాల్, కాన్పూర్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో అక్టోబర్ 8.. అంటే రేపటి శనివారం ఉదయం 6 గంటల నుండి సీఎన్‌జీ ధరలు భారీగా పెరగనున్నాయి. ధరల పెంపు అనంతరం సవరించిన ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ. 75.61 గా ఉండగా ధరల పెంపు అనంతరం రూ. 78.61 చేరనుంది. అలాగే నొయిడా, గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్‌లో ఇప్పటివరకు రూ. 78.17 గా ఉన్న సీఎన్‌జీ ధరలు రేపటి నుండి రూ 81.17 కి చేరుకోనున్నాయి.
గురుగ్రామ్‌లో కిలో సీఎన్జీ ధర ఇప్పటివరకు 83.94 రూపాయలు ఉండగా.. అక్టోబర్ 8వ తేదీ నుండి అత్యధికంగా 5 మేర పెరిగి రూ. 89.07 మార్క్ తాకనుంది. హర్యానాలోని రెవారిలో రూ. 86.07 గా ఉన్న కిలో సీఎన్జీ ధర ఇకపై 89.07 కి చేరనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కిలో సీఎన్జీ ధర 82.84 రూపాయలు ఉండగా అక్టోబర్ 8 నుంచి ఈ ధరలు 85.84 గా ఉండనుంది. అలాగే కాన్పూర్‌లో 87.40 రూపాయలుగా ఉన్న సీఎన్జీ 89.91 మార్క్ తాకనుంది.
Also Read : Ola, Uber, Rapido Autos: మరో మూడు రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలు బంద్
Also Read : Xiaomi Assets Seizure Case: షావోమి ఇండియా భారత్ నుండి పాకిస్థాన్‌కి వెళ్లిపోతోందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి