Hijab Row: దేశాన్ని కుదిపేస్తున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యాచారాలు పెరగడానికి కారణం హిజాబ్ ధరించకపోవడమేనంటున్నారు.
కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హిజాబ్‌పై ఎవరి వాదనలు వారు విన్పిస్తున్నారు. హిజాబ్ కారణంగా కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘర్షణ పరిస్థితుల్ని అదుపు చేసేందుకు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు కర్ణాటక హైకోర్టు పాఠశాలల్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా ఆదేశించింది. కోర్టు తీర్పు వెలువడేవరకూ యూనిఫాం కోడ్ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లనే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. హిజాబ్ అంటే అర్ధం ఇస్లామిక్ పరిభాషలో తెర అని అర్ధం. యవ్వనంలో అమ్మాయిల సౌందర్యాన్ని దాచి ఉంచేందుకు ఉపయోగించే తెరే హిజాబ్. అమ్మాయిలు అందాన్ని ప్రదర్శించకుండా హిజాబ్ ధరించడం ద్వారా అనర్దాలు జరక్కుండా ఉంటాయని ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ చెప్పారు. హిజాబ్ ధరించనివారే ఎక్కువగా అత్యాచారాలకు గురవుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా అత్యాచారాల రేటు పెరగడానికి కారణం...హిజాబ్ ధరించకుండా సౌందర్యాన్ని ప్రదర్శించడమేనని చెప్పారు. ఇస్లామిక్ సాంప్రదాయంలో ఓ భాగంగా ఉన్న హిజాబ్ (Hijab Row) కొత్తది కాదని..చాలా ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. అయితే హిజాబ్ ధరించడమనేది తప్పనిసరి కాదని..ఎవరయితే తమను తాము కాపాడుకోవాలనుకుంటారో..వారికి తప్పనిసరి అన్నారు. అమ్మాయిల్ని హిజాబ్ రక్షిస్తుందని చెప్పారు.
మరోవైపు కర్ణాటకలో రోజురోజుకూ హిజాబ్ వివాదం పెరిగి పెద్దదవుతోంది. హిజాబ్ ఆందోళనకు పోటీగా కాషాయరంగుల కండువాల ప్రదర్శన పెరుగుతోంది. కర్ణాటక హైకోర్టు తీర్పు వరకూ హిజాబ్ వివాదం ఎక్కడికి చేరుతుందనేది ఆసక్తిగా మారింది.
Also read: Hijab Row: ఏదో ఒకరోజు ఈ దేశానికి హిజాబీ ప్రధాని.. హిజాబ్ వివాదంపై ఒవైసీ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook