కాంగ్రెస్ పార్టీ ( Congress party ) లో నిరసన స్వరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్టీ సీనియర్ల రూపంలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మొన్న కపిల్ సిబల్..నేడు గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ పార్టీకు అధికారం కష్టమే అంటున్నారంతా.
వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకు రోజుకో కొత్త సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయిన పార్టీలో సీనియర్లు నిరసన స్వరం విన్పిస్తున్నారు. ఇప్పటకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై కేంద్రమాజీ మంత్రి కపిల్ సిబల్ ( Kapil sibal ) చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపాయి. నాయకత్వ తీరులో మార్పులు రాకపోతే ఇక ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని విజయం వరించదని కపిల్ సిబర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చల్లారక ముందే..మరో సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ( Gulam nabi Azad ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో 5 స్టార్ సాంప్రదాయం పెరిగిపోయిందని..నేతలు ప్రజల్లో కంటే ఏసీ రూముల్లోనే ఎక్కువ గడుపుతున్నారని గులాం నబీ ఆజాద్ విమర్శలు చేశారు.
పార్టీలో గతంలో ఉన్న పరిస్థితుల్లేవని..నేతల్లో మార్పు వస్తోందని ఆజాద్ తెలిపారు. పార్టీ టికెట్ దక్కగానే..5 స్టార్ హోటళ్లలో ప్రత్యక్షమవుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటమనేది చేయకుండా..ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేయగానే తమ పని అయిపోయిందనే భ్రమలో ఉన్నారన్నారు. గతంలో కర్ణాటక ( Karnataka ), ఏపీ ( AP ), కేరళ ( Kerala ) రాష్ట్రాల్లో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇన్‌ఛార్జ్‌గా పార్టీని బలోపేతం చేశానన్నారు. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని.. 7 స్థానాలు ఉన్న పార్టీకి 35 స్థానాల వరకు వచ్చాయని గుర్తు చేశారు. ఏపీలో వైఎస్సార్ ( Ysr Government ) నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని..తరువాత పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఏసీ రూములు వదిలి బయటకు వస్తేనే పార్టీకు పునర్ వైభవం వస్తుందని..లేకుంటే ఎప్పటికీ రాదని తేల్చి చెప్పారు. Also read: Indian Army: సరిహద్దుల్లో రహస్య సొరంగం గుర్తింపు