Corona Cases in India: దేశంలో కరోనా అలజడి రేపుతోంది. రోజురోజుకు కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 11,692 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ బారిన పడి 28 మంది మృత్యువాతపడ్డారు తాజా కేసులతో మెుత్తం కేసుల సంఖ్య 4,48,69,684 కు పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 66,170గా ఉంది. ఇది టోటల్ కేసుల్లో 0.15 శాతంగా ఉంది. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,31,258కి పెరిగింది. భారత్ లో రికవరీ రేటు 98.67 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో 10,780 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,42,72,256కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 5.09%, వీక్లీ సానుకూలత రేటు 5.33%గా రికార్డు అయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 92.50 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు. గడిచిన ఒక్క రోజులో 2,29,739 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 2,20,66,31,979 టీకా డోసుల ఇవ్వబడ్డాయి. గత 24 గంటల్లో 3,647 వ్యాక్సిన్లు ఇచ్చారు.
Also Read: Coronavirus Latest: ఒక్క రోజులోనే 12 వేలకు పైగా కొత్త కేసులు.. ఎంత మంది చనిపోయారంటే?
19 డిసెంబర్ 2020 నాటికి దేశంలో కరోనా కేసులు సంఖ్య కోటి దాటింది. మే 4, 2021 నాటికి మహమ్మారి సోకిన వారి సంఖ్య 2 కోట్లు, జూన్ 23, 2021 నాటికి 3 కోట్లు, జనవరి 25, 2022 నాటికి 4 కోట్లు దాటింది.
Also Read: Poonch Terror Attack: పూంచ్‌లో మరోసారి టెర్రర్ ఎటాక్.. ఐదుగురు సైనికుల మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook