Commodities rates: కిలో ఉప్పు రూ. 130, చక్కెర రూ.150 .. అదీ కూడా మనదేశంలో..!

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు  అందుబాటులో ఉంటాయి. కానీ మనదేశంలోని కొండ ప్రాంతాల్లో వాటి ధరలు కొండెక్కాయి. అక్కడి వాతావరణ పరిస్థితులే ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2021, 02:26 PM IST
  • ఉత్తరాఖండ్ లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు
  • భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులు
Commodities rates: కిలో ఉప్పు రూ. 130, చక్కెర రూ.150 .. అదీ కూడా మనదేశంలో..!

Kg Salt Rs. 130: మనదేశంలోని కొండ ప్రాంతాల్లో నిత్యావసరాల ధరలు (Commodities rates) ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ ధరల కంటే 8రెట్లు ఎక్కువగా అక్కడ రేట్లు ఉన్నాయి. సాధారణంగా మనదగ్గర కిలో ఉప్పు రూ.20 నుంచి రూ.30 ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్‌(Uttarakhand‌)లోని కొన్ని గ్రామాల్లో ఉప్పు ధర రూ.130కి చేరింది. ఇదేకాదు.. అక్కడ చక్కెర, పిండి ఇతరత్రా సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్‌ జిల్లా(Pithoragarh District)కు సమీపంలో ఉండే పలు హిమాలయ పర్వత ప్రాంత గ్రామాల్లో గత కొన్ని రోజులుగా నిత్యావసరాల ధరలు మోత మోగుతున్నాయి. కిలో చక్కెర రూ.150, వంట నూనె ధర రూ.275 నుంచి రూ.300, పిండి రూ.150, ఎర్ర కందిపప్పు కిలో రూ.200 పలుకుతోంది. బియ్యం ధర కూడా కిలోకు రూ.150 ఉండగా.. కేజీ ఉల్లిగడ్డ రూ.125కి చేరింది. 

Also Read: Pakistan drone in Jammu: జమ్మూలో పాక్ డ్రోన్‌ చక్కర్లు.. ఆయుధాలు విడిచి వెళ్లిపోయిన డ్రోన్

ఈ గ్రామాలన్నీ భారత్-చైనా సరిహద్దుల్లో ఉంటాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ గ్రామాలకు వెళ్లే రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సరకుల రవాణా కష్టతరంగా మారింది. దీనికి తోడు కరోనా దృష్ట్యా నేపాలీ కూలీలు స్వదేశానికి వెళ్లిపోవడంతో సరకు రవాణాకు కూలీలు దొరకడం లేదు. దీంతో రవాణా ఛార్జీలు పెరిగాయి. నిత్యావసర వస్తువులు(Commodities rates) సరిపడా అందుబాటులో లేకపోవడంతో వీటి ధరలు కొండెక్కాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని తమ గ్రామాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని కోరుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News