Swati Maliwal Dragged by Car: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌నే కారుతో లాక్కెళ్లాడు

DCW chief Swati Maliwal Dragged by Car: తనపై వేధింపులకు పాల్పడి, తనని కారుతో పాటే లాక్కెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్ తెలిపారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా అందరికీ తెలియజేశారు.

Written by - Pavan | Last Updated : Jan 19, 2023, 04:07 PM IST
Swati Maliwal Dragged by Car: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌నే కారుతో లాక్కెళ్లాడు

DCW chief Swati Maliwal Dragged by Car: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌కి బుధవారం అర్ధరాత్రి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో మహిళల రక్షణ ఎలా ఉందో చెక్ చేద్దామని వెళ్లిన ఆమెకి ఓ కారు డ్రైవర్ చేతిలో దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్ ట్విటర్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం మహిళల సంరక్షణ పరిశీలించే క్రమంలో ఓ కారు డ్రైవర్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని.. అతడిని గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కారు విండో అద్దాలు లాక్ చేసి తనని 10 - 15 మీటర్ల దూరం కారుతోనే లాక్కెళ్లాడని ట్వీట్ చేశారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బట్టకట్టానని.. దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌‌కే రక్షణ కరువైతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని స్వాతి మలివాల్ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.

తనపై వేధింపులకు పాల్పడి, తనని కారుతో పాటే లాక్కెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్ తెలిపారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా అందరికీ తెలియజేశారు. 

 

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. బుధవారం అర్థరాత్రి దాటాకా తెల్లవారిజామున 3.11 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ 2వ గేటుకు ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై నిలబడి తన టీమ్‌తో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది అని అన్నారు. నిందితుడు హరీష్ చంద్ర ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని.. అతడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించడం జరిగింది అని తెలిపారు. 

 

నిందితుడు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ని తన కారు ఎక్కాల్సిందిగా అడిగాడని.. అతడిని పట్టుకునేందుకు ఆమె ప్రయత్నించగా కారు అద్దాలు పైకి ఎత్తి లాక్ చేయడంతో పాటు కారుతో లాక్కెళ్లాడని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం హరీష్ చంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. మరోవైపు బాధితురాలు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌కి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. 

ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చదవండి : Attack On Fruit Vendor: రూ. 5 కోసం పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారిపై పైశాక దాడి.. వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Lovers Viral Video : స్కూటీ నడుపుతూ లవర్స్ వింత చేష్టలు.. సీన్ కట్ చేస్తే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News