Chhath Puja Festival: ప్రజలంతా ఇంకా దీపావళి సంబరాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మరో గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఉత్తరాదిన అనేక రాష్ట్రాలలో ఛత్ పూజను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.
PM Modi To Host Dinner Party: న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ విందు పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ జరిగే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ స్థలం ఈ డిన్నర్ పార్టీకి వేదిక కానుంది.
Rs. 10,000 for Flood Victims: న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ వరదలు అక్కడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసులు వరదల్లో సర్వం కోల్పోయారు. విలువైన ఆస్తిపత్రాల నుంచి మొదలుకుని తినడానికి అవసరం అయ్యే కనీస నిత్యావసర సరుకుల వరకు సకలం వరదల్లో కొట్టుకుపోయాయి.
Heavy Rains in Delhi: ఇప్పటికే ఢిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాలతో దేశ రాజధాని వరదల్లో చిక్కుకోగా.. ఢిల్లీకి భారీ వరద ముంపు పొంచి ఉందని ఢిల్లీ సర్కారు ఆదివారం హెచ్చరికలు జారీచేసింది. హర్యానాలో భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది.
Robbery Batch Attacks:ఢిల్లీ, సరైకలే ఖావ్, నొయిడాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన 1.5 కిమీ పొడవైన సొరంగమార్గంలో ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగలు రెండు బైకులపై వచ్చి కారును అడ్డుకోవడం.. అందులో ఒకరు తుపాకీ చూపించి డ్రైవర్ ని బెదిరిస్తుండగా.. మరొకడు వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి నుంచి క్యాష్ బ్యాగు దోచుకోవడం టన్నెల్లో ఏర్పాటు చేసిన సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయింది.
Delhi Liquor Scam Case latest news updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఈడీ దాఖలు చేసిన నాలుగో చార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా అనేక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సైతం ఈడీ కోర్టుకు సమర్పించినట్టు సమాచారం అందుతోంది. ఆ డీటేల్స్ క్లుప్తంగా..
CBI Summons Arvind Kejriwal: తాజాగా ఈ మెయిల్ ద్వారా పలు కీలక అంశాలు వెల్లడించిన సుకేష్ చంద్రశేఖర్.. ఢల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సీబీఐ నోటీసులు అంశాన్ని సైతం అందులో ప్రస్తావించాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకి రావాల్సిందే అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చిన లీక్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత హీటెక్కిస్తున్నాయి.
CBI Summons Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఇదే కేసులో సీబీఐ నోటీసులు జారీచేయడం చర్చనియాంశమైంది.
DCW chief Swati Maliwal Dragged by Car: తనపై వేధింపులకు పాల్పడి, తనని కారుతో పాటే లాక్కెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా అందరికీ తెలియజేశారు.
Delhi Liquor Scam Updates: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సర్కారు ఎక్సైజ్ పాలసీలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఆరోపణలు జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కుతున్నాయి.
పంజాబ్‌లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా వారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీలు గుప్పించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు నెలకు రూ. 1000 అందివ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకప్పటితో పోల్చుకుంటే ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆందోళనకర పరిస్థితులు నుంచి హమ్మయ్య ఇక ఏం కాదులే అనే స్థితికి ఢిల్లీ ఇప్పుడిప్పుడే చేరుకుంటోంది. అయితే, ఇదే క్రమంలో గత ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లాక్‌డౌన్‌ను (Delhi lockdown) మే 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
COVID-19 Vaccination for 18-44 age group:ఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఈ రోజు నుంచే వ్యాక్సిన్ పంపిణీ నిలిపేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించుకుంది.
Delhi HC on Oxygen supply: న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. అనేక చోట్ల ఆక్సీజన్ కొరత కారణంగా కరోనా రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. మరోవైపు ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రాలకు వాటికి సమీపంలోని అక్సీజన్ ప్లాంట్స్ నుంచి ఆక్సీజన్ కేటాయింపులు జరిపింది.
Summer holidays for Delhi Schools: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేటి రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 26న ఉదయం 5 గంటల వరకు దేశ రాజధాని ఢిల్లీలో 6 రోజుల పాటు లాక్డౌన్ (Delhi under lockdown) ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
COVID-19 cases in Delhi: ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ సంక్షోభంలో చిక్కుకుంటోంది. స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాటల్లోనే ఈ విషయం స్పష్టమవుతోంది. ఓవైపు ఢిల్లీలో 24 గంటల్లో దాదాపు 24 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంటే.. మరోవైపు ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ (Oxygen shortage), లైఫ్ సేవింగ్ డ్రగ్‌గా పేరున్న యాంటి వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ వ్యాక్సిన్, ఐసీయూ బెడ్స్‌కి తీవ్రమైన కొరత ఏర్పడుతోంది.
Delhi AIIMS doctors tested positive: న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనావైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసే ఘటన ఇది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది డాక్టర్లు కరోనావైరస్ బారినపడ్డారు. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రుల్లో రెండోది అయిన ఎయిమ్స్‌లో 35 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు కరోనాపై పోరులో పాల్గొంటున్న వైద్య సిబ్బందిని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Schools, Colleges closed in Delhi: న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు నానాటికి భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్టు శుక్రవారం ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే.. లాక్డౌన్ (Lockdown in Delhi) విధిస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.