Summer holidays 2021: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఢిల్లీ సర్కారు

Summer holidays for Delhi Schools: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేటి రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 26న ఉదయం 5 గంటల వరకు దేశ రాజధాని ఢిల్లీలో 6 రోజుల పాటు లాక్‌డౌన్ (Delhi under lockdown) ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2021, 09:50 PM IST
Summer holidays 2021: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఢిల్లీ సర్కారు

Summer holidays for Delhi Schools: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేటి రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 26న ఉదయం 5 గంటల వరకు దేశ రాజధాని ఢిల్లీలో 6 రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ప్రకటించిన వెంటనే, కేజ్రీవాల్ ప్రభుత్వం మరో ప్రకటన కూడా చేసింది. సమ్మర్ హాలిడేస్‌ని రీషెడ్యూల్ చేస్తూ ఏప్రిల్ 20 నుండి జూన్ 9 వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు ఢిల్లీ సర్కారు (Delhi govt) వేసవి సెలవులను ఖరారు చేసింది.

అంతకుముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 11 నుండి జూన్ 30 వరకు వేసవి సెలవులు ఉండాల్సి ఉండేది. అయితే, కరోనావైరస్ కేసుల (COVID-19 cases) పెరుగుదల కారణంగా వేసవి సెలవుల షెడ్యూల్‌ని మార్చి ఏప్రిల్ 20 నుండి జూన్ 9 వరకు సెలవులను ప్రకటించారు.

Also read : దేశవ్యాప్తంగా Lockdown విధిస్తారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman

విద్యా శాఖ డైరెక్టరేట్ కూడా ఒక సర్క్యులర్‌ను విడుదల చేస్తూ.. పాఠశాల హెడ్ మాస్టర్స్ పాఠశాల సంబంధిత పనుల నిమిత్తం అవసరమైతే సెలవుల్లో ఉన్న సిబ్బందిని తిరిగి పాఠశాలకు పిలవాల్సి ఉంటుందని, అలాగే కరోనావైరస్ మార్గదర్శకాలను (COVID-19 guidelines) సక్రమంగా పాటించేలా చూడాలని ఆ సర్కులర్‌లో పేర్కొన్నారు.

Also read : COVID-19 బారిన పడిన వారిలో 70% కిపైగా Patients 40 ఏళ్లకు పైబడిన వారే: ICMR

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News