Manoj Manoj meets ChandraBabu Naidu: సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటించి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ వేడుకలలో మంచు మోహన్ బాబు ఆయన భార్యతో పాటు మంచు విష్ణు వారి భార్య పిల్లలు మాత్రమే ఉన్నారు.
ఇకపోతే కుటుంబ సభ్యులంతా ఇక్కడ ఉన్నారని తెలుసుకొని మంచు మనోజ్ దంపతులు నేడు ర్యాలీతో తిరుపతి వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ముందే భావించిన పోలీసులు, దాదాపు 100 మంది పోలీసులను మోహన్ బాబు కాలేజ్ గేటు వద్ద నియమించినట్లు తెలుస్తోంది. అలాగే మోహన్ బాబు నివాసం వద్ద కూడా పోలీస్ బలగాలని ఏర్పాటు చేశారు.
ఇకపోతే ఏ క్షణాన అయినా గొడవలు జరిగే ఉద్దేశం ఉందని భావించిన పోలీసులు, మోహన్ బాబు యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వకుండా మంచు మనోజ్ కు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
- #MohanBabu యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
- కాలేజీకి #ManchuManoj వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను సెక్యూరిటీ సిబ్బంది గేట్లను పూర్తిగా మూసివేశారు.
- కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
- మంచు మనోజ్ దంపతులు… pic.twitter.com/NZaUDLlCOe
— Gulte (@GulteOfficial) January 15, 2025
ఇకపోతే మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారావారిపల్లి లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన ఈ జంట, ఆ తర్వాత మంత్రి లోకేష్ ని కూడా కలిశారు. ఇక ఇప్పుడు రేణిగుంట ఎయిర్‌పోర్టు నుండి మోహన్ బాబు యూనివర్సిటీకి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకుంటూ వస్తున్న నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా గత ఏడాది చివరిలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే, అది మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్ గొడవపడడం వల్లే.. ఈ విషయం కాస్త పోలీసులు ఏకంగా హైకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.