Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ ఫన్ రైడ్

Sankranthiki Vasthunam Twitter Review and Public Talk: అనిల్ రావిపూడి-వెంకీ కాంబో అంటేనే నవ్వుల పండగ. ఈ సంక్రాంతికి మరింత హాయిగా నవ్వించేందుకు సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చేసింది. ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో నెటిజన్లు ఏమంటున్నారు..? ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు..? చూసేద్దాం పదండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 14, 2025, 06:47 AM IST
Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ ఫన్ రైడ్

 Sankranthiki Vasthunam Twitter Review and Public Talk: సంక్రాంతికి అభిమానులను అలరించేందకు వెంకీ మామ వచ్చేశాడు. అనిల్ రావిపూడి-వెంకటేశ్ కాంబోలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. F2, F3 సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న ఈ కాంబో.. హ్యాట్రిక్ హిట్ కొట్టేందకు రెడీ అయింది. ఈ మూవీలో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య రాజేష్.. మాజీ లవర్‌గా మీనాక్షి చౌదరి నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌తో అంచనాలు పెరిపోగా.. సాంగ్స్, ప్రమోషన్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేశారు. ఆ హైప్‌కు తగినట్లే ప్రీ బుకింగ్స్‌ కూడా భారీగా జరిగాయి. 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌ చేసేందుకు వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఆడియన్స్‌ను మెప్పించిందా..? ట్విట్టర్‌లో మూవీ చూసిన వాళ్లు ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు..? ఓ లుక్కేద్దాం పదండి.  

"కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన పండుగ రావిపూడి ఎంటర్‌టైనర్. భారీ తారాగణం, పవర్‌ఫుల్ విజువల్స్‌తో వెంకటేశ్‌ మెరిసిపోయాడు. కొంత హాస్యం సాగదీసినట్లు అనిపించినా.. సినిమా సరదాగా, ఆకర్షణీయంగా ఉంటుంది." అని మెచ్చుకుంటున్నారు. కచ్చితంగా ఫ్యామిలీతో చూడాలని చెబుతున్నారు. 

 

వెంకటేశ్‌ యాక్టింగ్‌తో పాటు ఐశ్వర్య రాజేశ్ నటన కూడా మూవీకి పెద్ద ప్లస్ అని మెచ్చుకుంటున్నారు. పెళ్లి ఫేమ్ పృథ్వీ క్యారెక్టర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని అంటున్నారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రోల్ సర్‌ప్రైజింగ్‌ ఉంటుందని ట్వీట్ చేస్తున్నారు.

 

 

 

"ఇప్పుడే షో చూశాను. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో కాస్త నిరాశకు గురి చేసినా.. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సెకండ్ హాఫ్ కొని పార్ట్‌లలో ఎంటర్‌టైన్ చేస్తుంది. మొత్తం మీద హాయిగా నవ్వుకునే సినిమా. దీనికి సీక్వెల్ కూడా రావచ్చు. చాలా డైలాగ్‌లు, వన్ లైనర్లు పాపులర్ అవుతాయి" అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

 

"బ్లాక్‌బస్టర్ ఫన్ రైడ్. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇది పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్. నేను 3.75/5 రేటింగ్ ఇస్తాను. బ్లాక్ బస్టర్. హాయ్‌కి కొత్త అర్థం" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

 

"టైంపాస్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కామెడీని పంచే ఉద్దేశంతోనే తీశారు. దర్శకుడు రావిపూడి F2 జోన్‌లో ఈ చిత్రం ఉంటుంది. కామెడీ బాగా పని చేస్తుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా కాస్త చౌకగా అనిపిస్తాయి. సినిమాకు కూడా పెద్దగా కథాంశం లేదు. అయితే లాజిక్స్, కథాంశం మినహా సినిమా వెంకీ ఎలిమెంట్స్, బిల్ రాజు పాత్ర, మంచి సంగీతంతో అలరించింది. ఈ పండుగ సీజన్‌లో ఫ్యామిలీతో చూడదగిన మూవీ." అని మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

 

Trending News