Telangana Govt Employees News: ఎన్నో అంశాల్లో ఇతర శాఖలకు ఆదర్శంగా నిలుస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ.. తాజాగా ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని నిర్ణయించింది. Pr &Rd శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సచివాలయం చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు తరచూ సచివాలయం, పంచాయతీ రాజ్ కమిషనరేట్ల చుట్టూ తిరగడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనులకు ఆటంకం కలగడంతో పాటు, హైదరాబాదులో ఉన్నతాధికారుల సమయం వృధా అవుతుంది.
అందుకే ఉద్యోగుల సమయం, వ్యయ ప్రయాసలకు చెక్ పెట్టేలా నూతన విధానాన్ని రూపొందించింది. ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ అంశాల పరిష్కారానికి ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తారు. ఈ విధానం ప్రకారం ప్రతి నెల రెండో, నాలుగో శుక్ర వారాల్లో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు.. ఓ గంట పాటు ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం నిర్వహిస్తారు. పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చే వెబ్ లింక్ ద్వారా సమస్యలున్న ఉద్యోగులు జాయిన్ అయ్యి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు. శాఖ హెడ్ ఆఫీస్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే.. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపుతారు. ఆన్లైన్ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, SERP CEO దివ్య దేవరాజన్, prrd డైరెక్టర్ సృజన, మిషన్ భగీరథ, రూరల్ ఇంజనీరింగ్ ENC లు అందుబాటులో ఉంటారు. అవసరమైతే మంత్రి సీతక్క సైతం ఆన్లైన్ సమావేశానికి హాజరవుతారు.
ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు విని సత్వర పరిష్కారం చూపుతారు. పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తారు. సమస్యలు ఉన్న ఉద్యోగులు, ఏవైనా పత్రాలు సమర్పించదల్చుకుంటే ప్రత్యేక మెయిల్ ఐడీని, వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ విధానంలో ఉద్యోగ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎంతో సమయం, శ్రమ వ్యయం ఆదా అవుతుంది. అటు ఉన్నతాధికారులు సైతం శాఖ పరమైన అంశాలపై ఫోకస్ పెట్టే వెసులుబాటు ఉంటుంది. తద్వారా పంచాయతీ రాజ్ శాఖ వేగవంతంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతుంది.
"గ్రామీణ ప్రాంతా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతన విధానాన్ని అమలుపరుస్తున్నాం. ఇక హైదరాబాద్ రాకుండానే ఉద్యోగులు ఆన్లైన్లోనే తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాలన పరుగులు పెడుతోంది. గ్రామీణ ఉద్యోగులు చురుగ్గా పనిచేస్తే ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతాయి.
శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా ఆన్లైన్ మీటింగ్ లో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎలాంటి సమన్వయ లోపం లేకుండా వెను వెంటనే ఉద్యోగ సమస్యలకు, సర్వీస్ మ్యాటర్ల కు పరిష్కార మార్గం లభిస్తుంది. సచివాలయంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో, కమిషనరేట్ కార్యాలయం స్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ఆన్లైన్ గ్రీవెన్స్ విధానం సత్వర పరిష్కారం చూపిస్తోందన్న నమ్మకం ఉంది. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.." అని మంత్రి సీతక్క కోరారు.
Also Read: Kateri Halwa: సంక్రాంతి స్పెషల్.. అందరు తప్పకుండా తినే కాటేరీ హల్వా ఇలా ఈజీగా చేసుకొవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.