Double murder case update in Hyderabad: సంక్రాంతి పండగ వేళ హైదరబాద్ లోని పుప్పాలగూడలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ, ఆమె పక్కన మరోక వ్యక్తిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ క్రమంలో పోలీసులుస్థానికులు సమాచారంలో అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే.. ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హత్యకు గురైన వాళ్లను అంకిత్ సాకేత్, బిందులుగా పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో.. నానక్ రామ్ గూడలో ఉంటున్న అంకిత్ సాకేత్‌కు ఎల్బీ నగర్లో ఉంటున్న బిందుకు మధ్య ప్రేమ ఏర్పడింది. మరోవైపు.. బిందుకు అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా, అంకిత్ సాకేత్‌తో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఉంది. ఇది చాలదన్ననట్లు.. మరోక యువకుడితో కూడా ఎఫైర్ పెట్టుకుంది.
ఈనెల 3న ఇంటి నుండి వెళ్లిపోయిన బిందు.. సాకేత్ వద్దనే ఉంటున్నట్లు సమాచారం. సదరు వివాహిత భర్త.. జన్వరి 4 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీరిద్దరు పుప్పాల గూడ గుట్ట వద్దకు ఏకాంతంగా గడపడానికి అంకిత్ సాకేత్, బిందు వెళ్లారు.
ఈ విషయం ఆమెను అనుసరిస్తున్న.. బిందు రెండో ప్రియుడికి తెలిసింది. దీంతో తనను మోసం చేసిందని కోపంతో... ఎలాగైన ఆమెను అంతం చేయాలని ప్లాన్ తో వాళ్లను సదరు వ్యక్తి ఫాలో అయ్యాడు. అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న.. కత్తులతో రెడీగా ఉన్నాడు.
Read more: Viral Video: వీడియో ఇదే.. శివలింగాన్ని భక్త మార్కాండేయుడిలా హత్తుకున్న ఎలుగు బంటి.. ఎక్కడో తెలుసా.?
వాళ్లిద్దరు కూడా.. రొమాన్స్ లో ఉండగా.. కత్తులతో పొడిచి, బండరాళ్లతో మోదీ.. ఇద్దర్ని అంతమోదించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో కనుగొన్నారు. ఈ క్రమంలో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం. మహిళ ఛత్తీస్ గడ్ కు చెందిన మహిళకాగా, సాకేత్ మధ్య ప్రదేశ్ కు చెందిన వాడని స్థానికులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter