minister ponnam Prabhakar attended kothakonda veerabhadra swamy jathara: మంత్రి పొన్నం ప్రభాకర్ తరచుగా ఆవేశంతో ఊగిపోతుంటారు.. ఆయన అనేక సమావేశాలలో కాస్తంత ఆవేశంతో మాట్లాడిన అనేక సందర్భాల వల్ల వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలొ బీఆర్ఎస్ నేతలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అంటూ కూడా.. గతంలో పిలిచే వారు. ఇదిలా ఉండగా.. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు హజరయ్యారు.
జాతరలో ఏర్పాట్లు సరిగ్గా లేవని మరోసారి అలిగిన మంత్రి పొన్నం
హనుమకొండ కొత్తకొండ జాతరకు సరైన ఏర్పాట్లు చేయని ప్రభుత్వం
జాతరకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను చూసి భక్తులు నిలదీయడంతో ఏర్పాట్లు చేయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన మంత్రి… https://t.co/jRMpC6WRjK pic.twitter.com/3g5u2MMu7U
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025
అయితే.. దీనిలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకొవాలని ముందే అధికారులకు మంత్రి పొన్నం సూచించారు. కానీ తీరా జాతర సమయం వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామి జాతర జరుగుతుంది. దీనిలో పాల్గొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు.
ఈ క్రమంలో భక్తులు జాతరలో ఏర్పాట్లు బాగా లేవని, మంత్రితో మొరపెట్టుకున్నారు. అధికారులు సమన్వయం చేసుకొలేదని కూడా అనేక ఫిర్యాదులు మంత్రి గారికి అందాయి. దీంతో ఆయన ఆవేశంతో ఊగిపోయి.. అక్కడే నెల మీద కూర్చున్నారు. అంతే కాకుండా మోకాళ్ల మీద మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
స్థానిక అధికారుల మీద చిర్రుబుర్రులాడారు. కొంత మంది పోలీసులు, దేవదాయ శాఖ వారు అత్యుత్సాహం ప్రదర్శించారని.. మంత్రి పొన్నంకు ఫిర్యాదులు అందాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఇలాంటి పనులు చేయోద్దని.. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని చురకలు పెట్టారు. గతంలో కూడా మంత్రి.. హైదరాబాద్ లో బోనాల సమయంలో.. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నేపథ్యంలో ప్రొటోకాల్ పాటించలేదని.. మంత్రి పొన్నం, మేయర్ టెంపుల్ బైట కూర్చొవడం దుమారంగా మారిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter