Director trinadha rao apology video viral: మజాకా మూవీ టీజర్ వేడుక నిన్న జరిగింది. ఈక్రమంలో డైరెక్టర్ త్రినాథ రావు.. వేదికపైన నుంచి మన్మథుడు ఫెమ్ అన్షును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. హీరోయిన్లు సైజ్ లు పెంచుకొవాలని కూడా ఆయన పచ్చిగా మాట్లాడారు. గతంలో మన్మథుడు సినిమాను చూసేందుకు.. ఈ హీరియిన్ కారణమని.. అప్పట్లొ కత్తిలా ఉండేదంటూ కూడా కామెంట్లు చేశారు.
మహిళలకు క్షమాపణ చెప్పిన డైరెక్టర్ నక్కిన త్రినాథరావ్
నిన్న మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ https://t.co/VFsWKsKDKz pic.twitter.com/59sw6TA3iR
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025
దీంతో నటి అన్షు తోపాటు, రీతు వర్మ కూడా చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. ఇది చాలదన్నట్లు.. అల్లు అర్జున్ సీన్ ను కూడా ఇన్ డైరెక్ట్ గా ఇమిటేట్ చేశారు. బన్నీ అప్పట్లో సీఎం రేవంత్ మర్చిపోయినట్లు.. డైరెక్టర్ రీతు వర్మ పేరును మర్చిపోయినట్లు ఇమిటేట్ చేశారు. ఇవన్ని నిన్నటి నుంచి తెగ వివాస్పదంగా మారాయి. నెటిజన్లు డైరెక్టర్ త్రినాథ రావును ఏకీపారేశారు. అదే విధంగా తెలంగాణ మహిళ కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించింది.
డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలకు నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం కాస్త ఇండస్ట్రీలో రచ్చగా మారింది. దీనిపై తాజాగా.. త్రినాథ రావు సారీ చెబుతు ఒక వీడియో రిలీజ్ చేశారు. నా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని.. అనుకొకుండా నోరు జారానని చెప్పారు.
కావాలని చేసింది కాదని.. ఏదో నవ్విద్దామనుకుంటే.. ఇలా జరిగిందని క్లారిటీ ఇచ్చారు. మనస్పూర్తిగా హీరియిన్ అన్షుకు.. మహిళలు అందరికి క్షమాపణలు కోరుతున్నట్లు ఒక వీడియో రిలీజ్ చేశారు. దయచేసి పెద్దమనస్సుతో అనుకొకుండా జరిగిన తప్పిదానికి క్షమించండని రెండు చేతులు జోడించి మరీ వేడుకున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.