Night curfew in Delhi: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్-19 కేసులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రతీ రోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారిజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఢిల్లీ సర్కార్ (Delhi govt) స్పష్టంచేసింది.
No lockdown in Delhi: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో లాక్డౌన్ విధించడం లేదని ఢిల్లీ సర్కార్ పెద్దలు తరచుగా మీడియా ఎదుట ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు మాత్రం ఢిల్లీవాసులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న తీరు చూస్తే ఎప్పుడు, ఏ క్షణం లాక్డౌన్ విధిస్తారో ఏమోననే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
Lockdown in Delhi, Minister Satyendar Jain clarity: కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత రోజుకింత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా కేసులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో గురువారం వరకే అప్పటికి గత 4 రోజుల్లో మొత్తం 4758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొత్తంలో నమోదైన 4193 కేసుల కంటే ఈ సంఖ్యే అధికంగా ఉండటం Delhi govt తో పాటు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
కరోనా భయం సమసిపోక ముందే.. దేశంలో మరో మహమ్మారి బర్డ్ ఫ్లూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
కరోనావైరస్ వ్యాక్సినేషన్‌కు ఢిల్లీ ప్రభుత్వం (Delhi) సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ (vaccination)కు సంబంధించిన ప్రణాళికలన్ని పూర్తిచేశామని కేజ్రీవాల్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. బుధవారం రికార్డు స్థాయిలో కరోనాతో 133 మంది మరణించగా.. ఒకరోజు తర్వాత శుక్రవారం మరణాల సంఖ్య మళ్లీ వంద మార్క్ దాటింది.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 28నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో మళ్లీ కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులనుంచి నిత్యం వేల సంఖ్యలో కరోనా (Coronavirus) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో లాక్డౌన్ విధిస్తారని పుకార్లు వ్యాప్తిచెందడంతో.. అవన్నీ అవాస్తవమని, లాక్డౌన్ విధించడం లేదని వైద్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Kumar Jain) సోమవారం వెల్లడించారు.
ఢిల్లీలో గత 24 గంటల్లో 21,098 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 3,235 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,85,406 కి చేరింది.
Ban on firecrackers in Delhi: న్యూ ఢిల్లీ: టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ నవంబర్ 5న ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ సర్కార్ ( Delhi govt ) ఆ మరుసటి రోజే మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా టపాసులు కాల్చినా, టపాసులు విక్రయించినా, కొనుగోలు చేసినా.. వారిపై రూ లక్ష వరకు జరిమానా విధించనున్నట్టు తాజాగా ఢిల్లీ సర్కార్ స్పష్టంచేసింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి విజృంభిస్తునే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్‌లాక్ 5.0 లో భాగంలో అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కళాశాలలలను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) ఏర్పాట్లు చేస్తోంది.
COVID-19 medicine: న్యూ ఢిల్లీ: కొవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్, టొసిలిజుమాబ్, ఫెవిపిరవిర్ వంటి ఔషధాలను మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని ఢిల్లీ సర్కార్ ( Delhi govt ) స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ విభాగం డ్రగ్స్ కంట్రోలర్స్కి ఆదేశాలు జారీచేసింది.
ఒకే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న వారిలో 41 మందికి కరోనావైరస్ సోకిన ఘటన ఢిల్లీలోని కపాషేరా ప్రాంతం టెకె వాలి గల్లీలో కలకలం సృష్టించింది. ఏప్రిల్ 18వ తేదీనే ఇదే బిల్డింగ్‌కి చెందిన ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు.
భారత్‌లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 478 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా వైరస్ సోకడం మొదలైన తర్వాత 24 గంటల్లో ఇంత అత్యధికంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.