Covid-19: ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

దేశ రాజ‌ధాని ఢిల్లీ ( Delhi ) లో క‌రోనావైర‌స్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 28నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.

Last Updated : Nov 19, 2020, 07:52 AM IST
Covid-19: ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

single day highest covid-19 deaths in delhi: న్యూఢిల్లీ‌: దేశ రాజ‌ధాని ఢిల్లీ ( Delhi ) లో క‌రోనావైర‌స్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 28నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారితో బుధవారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో 133 మంది క‌రోనా బాధితులు (highest covid-19 deaths ) మ‌ర‌ణించారు. ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కరోజుల్లో ఇన్ని మరణాలు నమోదవ్వడం ఇదే అత్య‌ధికమ‌ని ప్ర‌భుత్వం వెల్లడించింది. నిన్న 62వేల కరోనా పరీక్షలు చేయగా.. 7486 పాజిటివ్ కేసులు ( COVID-19 cases) న‌మోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. Also read: Mumbai Police: కంగనా, రంగోలీలకు మూడోసారి నోటీసులు

తాజాగా నమోదైన గణాంకాలతో.. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 5,03,084 కి చేరుకోగా.. మరణాల సంఖ్య 7,943 కి పెరిగింది. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,52,683 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే ఢిల్లీలో క‌రోనా మూడో ద‌శ విజృంభ‌ణ మొదలైందని, కొన్ని చర్యలు తీసుకోక తప్పదని ప్రకటించిన రెండు రోజుల్లోనే ఇన్ని మరణాలు సంభవించడంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడి, తీసుకోవలసిన చర్యలపై ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 89.98 శాతం ఉండగా, మరణాల రేటు 1.58 శాతం ఉంది. 

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News