Delhi Cafe Owner: మొన్న సుభాష్.. నిన్న పునీత్... భార్య వేధింపులు తాళలేక వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య.. స్టోరీ ఏంటంటే..?

Delhi cafe owner suicide: ఢిల్లీలో న్యూ ఇయర్ కు ఒక రోజు ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫెమస్ ఉడ్ బాక్స్ కేఫ్ సహా వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా (40) భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 1, 2025, 04:46 PM IST
  • న్యూ ఇయర్ కు ముందు షాకింగ్ ఘటన..
  • భర్త ప్రాణాలు తీసిన భార్య శాడిజం..
Delhi Cafe Owner: మొన్న సుభాష్.. నిన్న పునీత్... భార్య వేధింపులు తాళలేక వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య.. స్టోరీ ఏంటంటే..?

Delhi cafe owner Puneet khurana suicide amid divorce controversy: టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అతని భార్య వేధింపులు తాళలేక.. అతగాడు వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యావత్ దేశంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా ఈ ఘటనలో అనేక మంది మహిళలు సైతం...అతుల్ కు అండగా నిలిచారు. అతని భార్యపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో మహిళలు మాత్రమే కాదు.. పురుషులుకూడా వేధింపులకు గురౌతున్నరన్న ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది.  దీనిపై సుప్రీంకోర్టు సైతం.. మహిళలు.. సెఫ్టీ కోసం ఉన్న చట్టాలను తప్పుగా ఉపయోగించకూడదంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన మరువకముందే ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

 ఉడ్‌బాక్స్ కేఫ్ సహ-వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా (40) మంగళవారం రాత్రి తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ ఖురానాకు.. ఇతని  భార్య మానికా జగదీశ్ కు  విడాకుల గొడవలు నడుస్తున్నాయి.బిజినెస్ విషయంలో.. గొడవలు జరిగినట్లు తెలుస్తొంది.  ఈక్రమంలో నిన్న రాత్రి వీరి గొడవలు పీక్స్ కు చేరడంతో.. మాజీ భార్య మాటలు భరించలేక.. పునీత్ ఖురానా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తొంది.

పునీత్, మౌనికాలకు 2016 లో పెళ్లి జరిగినట్లు తెలుస్తొంది. తాజాగా.. వీరిద్దరు.. బిజినెస్ విషయంలో.. గొడవలు పడినట్లు తెలుస్తొంది. ఖురానా, మౌనికాలు.. వ్యాపారంలో తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ఖురాన్ ను నిలదీసిందంట. దీంతో అతగాడు.. ఒక వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే.. పునీత్ తన గదిలో విగత జీవిలా ఉండటంను కుటుంబ సభ్యులు గమనించారు.

Read more: Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఇండియన్ రైల్వేస్.. డిటెయిల్స్..

ఈ ఘటనపై పోలీసులకుఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. బాధితుడి ఫోన్ కాల్స్, డిటెయిల్స్ లను పోలీసులు స్వాధినం చేసుకున్నట్లు తెలుస్తొంది. వీరిద్దరు పునీత్ చనిపోక ముందు.. దాదాపు.. 16నిమిషాలు మాట్లాడుకున్నట్లు తెలుస్తొంది. పునీత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తొంది.   ప్రస్తుతం ఈ ఘటన మాత్రం.. మరోసారి దేశంలో భార్య వేధింపుల అంశంతో వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News