Highest Temperature in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలతో ప్రజలు సతమతం అవుతున్నారు. బుధవారం ఏకంగా 52.3 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. మంగళవారం నమోదైన 49.9 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. ముంగేష్‌పూర్‌లో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంగా ఎండలు ఉండడంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. గరిష్ట విద్యుత్ డిమాండ్ 8302 మెగావాట్లకు చేరుకుంది. వరుసగా 12 రోజుల పాటు పీక్ పవర్ డిమాండ్ 7000 మెగావాట్లకు చేరుకుందని డిస్కమ్ అధికారులు తెలిపారు.
Also Read: Realme GT 7 Pro: చూడగానే వావ్ అనిపించే డిజైన్‌తో కొత్త Realme GT 7 Pro వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే!
కాగా.. సఫ్దర్‌జంగ్‌లోని బేస్ అబ్జర్వేటరీలో మంగళవారం 45.8°C ఉష్ణోగ్రత నమోదైంది. గత పదహారు రోజులుగా ఢిల్లీలో భారీగా వేడి ఉంది. ప్రతి రోజూ 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ట్రోగతలు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలుల కారణంగా ఢిల్లీలో ఎండలు మరింతగా పెరుగుతున్నాయి. రానున్న కొద్ది రోజుల పాటు హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇంతకుముందు మే 2022లో అత్యధిక ఉష్ణోగ్రత 49.2°C నమోదైంది.
ఇక్కడ విపరీతమైన వేడిగా ఉందని.. దాదాపు నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఉందంటూ ఓ పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే మండుతున్న ఎండల నేపథ్యంలో కాస్త ఉపశమనం కలిగిస్తూ.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి తీవ్రతతో కూడిన వర్షం కురిసిందని ఐఎండీ తెలిపింది. మరోవైపు ఢిల్లీలో నీటి సంక్షోభం కూడా ఏర్పడింది. పొరుగున ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి కేటాయించిన నీటి వాటా విడుదల కాలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.
మే 1న వజీరాబాద్ వద్ద యమునా నీటిమట్టం 674.5 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 669.8 అడుగులకు తగ్గింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్‌లలో కనిష్ట స్థాయి 674.6 అడుగుల వద్ద ఉంది. కానీ హర్యానా, ఢిల్లీకి తగినంత నీటిని విడుదల చేయని నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీ నీటి అవసరాల్లో 64 శాతం హర్యానా ద్వారా వస్తుండగా.. 26.5 శాతం ఉత్తరప్రదేశ్ ద్వారా తీరుతున్నాయని తాజా ఆర్థిక సర్వే తెలిపింది.
Also Read: చిరంజీవి విశ్వంభర సెట్స్ లో స్టార్ హీరో సర్ప్రైజ్ ఎంట్రీ.. చిరుతో సరదాగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter